వెంకీ, కళ్యాణ్ రామ్‌ ‘జనవరి 12 విడుదల’ మూవీ డబ్బింగ్ స్టార్ట్

వెంకీ, కళ్యాణ్ రామ్‌ ‘జనవరి 12 విడుదల’ మూవీ డబ్బింగ్ స్టార్ట్

వెంకటేష్, కళ్యాణ్ రామ్‌‌  కలిసి నటిస్తున్న   క్రేజీ మల్టీస్టారర్ ‘జనవరి 12 విడుదల’.  అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నాడు.  సురేష్ ప్రొడక్షన్స్,  జీ స్టూడియోస్ సమర్పణలో  సాహు గారపాటి నిర్మిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న సినిమా విడుదల కానుంది. ఇప్పటికే షూటింగ్ చివరి దశలో ఉండగా మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కళ్యాణ్ రామ్.. తన పాత్రకు సంబంధించి డబ్బింగ్‌‌ను స్టార్ట్  చేశాడు. ‘పటాస్’ తర్వాత అనిల్ రావిపూడి, కళ్యాణ్ రామ్ కాంబినేషన్‌‌లో వస్తున్న సినిమా కావడంతో ఆసక్తి నెలకొంది.

 ఈసారి కళ్యాణ్ రామ్‌‌ను పూర్తిగా కొత్త స్టైలిష్ అవతార్‌‌లో చూపించబోతున్నాడు దర్శకుడు.  ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‌‌కు మంచి రెస్పాన్స్  రావడం సినిమాపై అంచనాలను పెంచింది.  కీర్తి సురేష్, కృతి శెట్టి హీరోయిన్స్‌‌గా నటిస్తున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు.  ఇంకా ఒక పాటతో పాటు కొంత టాకీ పార్ట్ మాత్రమే చిత్రీకరించాల్సి ఉంది.  మరోవైపు డిసెంబర్ 26 నుంచి అమెరికాలో భారీ స్థాయిలో ప్రమోషనల్ క్యాంపెయిన్ నిర్వహించనున్నట్టు మేకర్స్ తెలియజేశారు.