జూబ్లీహిల్స్, వెలుగు : బంజారాహిల్స్‌లోని హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్లో 8వ వార్షిక బ్రహ్మోత్సవాలు డిసెంబర్ 1 నుంచి 6 వరకు నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన పోస్టర్‌ను హరే కృష్ణ మూవ్మెంట్ హైదరాబాద్ అధ్యక్షులు, త్రిదండి శ్రీమాన్ సత్య చంద్ర స్వామీజీ మహారాజ్ ఆవిష్కరించారు. డిసెంబర్ 1న శ్రీ లక్ష్మీనరసింహ స్వామి మూలమూర్తి, ఉత్సవమూర్తులకు అభిషేకంతో వేడుకలు ప్రారంభం కానున్నాయి.
2న ధ్వజారోహణం, ఊంజల సేవ, 3న హనుమద్వాహన సేవ, 4న శ్రీ భూ సమేత నరసింహ స్వామి కళ్యాణోత్సవం నిర్వహించనున్నారు. 5న మహా సుదర్శన హోమం, గరుడ వాహన సేవ, శ్రీ రాధా గోవింద ఝూలన్ ఉత్సవాలు ఉంటాయి. 6న మహా పూర్ణాహుతి, చక్రస్నానం, 108 కలశాలతో మహా చూర్ణాభిషేకం, మహా సంప్రోక్షణ, శ్రీ పుష్పయాగంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.
