స్నేహం ముసుగులో మోసాలు.. ఆసక్తికరంగా ‘మైత్రి’ టైటిల్

స్నేహం ముసుగులో మోసాలు.. ఆసక్తికరంగా ‘మైత్రి’ టైటిల్

నిఖిల్ మాల్యాక్కల్, నిఖిల్ దేవాదుల, సలార్ విదేశ్, హారిక సుధాన్ ప్రధాన పాత్రల్లో నాగ కృష్ణ గుండ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘మైత్రి’. నల్లం శ్రీనివాస్ కుమార్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టైటిల్‌‌ను ప్రకటించారు. ముగ్గురు స్నేహితుల చుట్టూ తిరిగే ఆసక్తికరమైన కథాంశంతో ఈ సినిమాను ట్రావెలింగ్ క్రైమ్ థ్రిల్లర్‌‌గా తెరకెక్కిస్తున్నారు. 

స్నేహం ముసుగులో కొందరు చేసే మోసాలు, నిజమైన స్నేహితులను గుర్తించడంలో ఎదురయ్యే ఇబ్బందుల నేపథ్యంలో డిఫరెంట్ కథతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు దర్శక నిర్మాతలు తెలిపారు.   ప్రస్తుతం సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. చిట్టిబాబు.కె సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, అజయ్ అరసాడ సంగీతం అందిస్తున్నాడు.  అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి త్వరలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.