లక్సెట్టిపేట: జాతీయ షూటింగ్ బాల్ పోటీలకు విద్యార్థిని ఎంపిక

లక్సెట్టిపేట: జాతీయ షూటింగ్ బాల్ పోటీలకు విద్యార్థిని ఎంపిక

లక్సెట్టిపేట, వెలుగు:   ఈనెల 28నుంచి 30 వరకు ఉత్తరప్రదేశ్ లోని మెయిన్ పూరిలో జరగనున్న 45వ జాతీయస్థాయి షూటింగ్ బాల్ ఛాంపియన్షిప్ పోటీలకు లక్సెట్టిపేట పరిధిలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల పదవ తరగతి విద్యార్థిని ఏ.శాలిని ఎంపికైనట్లు  జిల్లా షూటింగ్ బాల్ జనరల్ సెక్రటరీ ఏ మహేశ్​తెలిపారు. 

ఈ నెల 14,15,16 తేదీల్లో వరంగల్ జిల్లా అన్నారంలో  నిర్వహించిన రాష్ట్ర స్థాయి షూటింగ్ బాల్  పోటీల్లో పాల్గొని ప్రతిభ కనబర్చింది. జాతీయస్థాయి పోటీలకు ఎంపికైన శాలినిని పాఠశాల ప్రిన్సిపల్ రమా కల్యాణి,  ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ మమత అభినందించారు.