యువత ఆలోచనా శక్తిని పెంపొందించుకోవాలి : ఆదిలాబాద్ కలెక్టర్‌‌ రాజర్షి షా

యువత ఆలోచనా శక్తిని పెంపొందించుకోవాలి : ఆదిలాబాద్ కలెక్టర్‌‌ రాజర్షి షా

ఆదిలాబాద్​, వెలుగు : నేటి పోటీ ప్రపంచంలో యువత ఉన్నత స్థాయికి ఎదగాలంటే కమ్యూనికేషన్‌‌ నైపుణ్యాలు, నాయకత్వ లక్షణాలు, విశ్లేషణాత్మక ఆలోచనా శక్తిని పెంపొందించుకోవాలని ఆదిలాబాద్​ కలెక్టర్‌‌ రాజర్షి షా సూచించారు. ఆదిలాబాద్‌‌లోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ లో ‘ఇన్‌‌స్పైర్‌‌ అండ్‌‌ ఇగ్నైట్‌‌’ సంస్థ ఆధ్వర్యంలో ‘యూత్‌‌ట్రాన్స్​ఫర్మేషన్‌‌ మిషన్‌‌’లో భాగంగా శుక్రవారం నిర్వహించిన వ్యక్తిత్వ వికాస శిక్షణ విద్యార్థులకు స్ఫూర్తిదాయంగా నిలిచింది.   

మెడికోస్​ వైట్​ కోట్​ సెర్మనీ 

నిర్మల్ : నిర్మల్​ గవర్నమెంట్​ మెడికల్​ కాలేజీలో శుక్రవారం 2026 బ్యాచ్ ఎంబీబీఎస్​ ఫస్టియర్​ విద్యార్థులకు వైట్ కోట్ సెర్మనీ నిర్వహించారు. చీఫ్​ గెస్ట్​గా హాజరైన కలెక్టర్ భవేశ్ మిశ్రా మాట్లాడుతూ వైద్య విద్యార్థులు ప్రారంభం నుంచే సేవాభావం పెంపొందించుకోవాలని సూచించారు. అనంతరం  వైద్య విద్యార్థుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన బస్సును ప్రారంభించారు.