కష్టపడ్డ కేడర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను గౌరవించాల్సిందే : ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చార్జి బీఎం సందీప్

కష్టపడ్డ కేడర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను గౌరవించాల్సిందే :   ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చార్జి బీఎం సందీప్
  • వచ్చే నెలలో నామినేటెడ్​ పదవుల భర్తీ 
  • ఆ వెంటనే పార్టీ పదవుల పంపకం
  • ప్రభుత్వ పదవులు ఇవ్వలేని వారికి పార్టీలో చోటు 
  • భర్తీ ఆలస్యమైతే పార్టీకి నష్టం జరగొచ్చు
  • పార్టీ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చార్జి సందీప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, పీసీసీ చీఫ్ మహేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గౌడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భేటీలో చర్చ

 హైదరాబాద్, వెలుగు: పార్టీ కోసం కష్టపడ్డ ప్రతి ఒక్కరిని గౌరవించాలని, జిల్లాల వారీగా అలాంటివారిని గుర్తించి జాబితాలు తెప్పించాలని పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చార్జి బీఎం సందీప్ ఆదేశించారు. శుక్రవారం గాంధీ భవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో భేటీ సందర్భంగా వారిద్దరు పలు విషయాలపై చర్చించారు. జిల్లాల్లో, నియోజకవర్గాల్లో పార్టీ నేతల మధ్య సమన్వయం, పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలు, నామినేటెడ్, పార్టీ పదవుల భర్తీలో సామాజిక సమీకరణలు వంటి అంశాలపై చర్చించారు.

పార్టీ అధికారం చేపట్టి మూడేళ్లయినా సందర్భంగా పార్టీ జెండా మోసిన కార్యకర్తలకు నామినేటెడ్ పదవి.. అది సాధ్యం కాకుంటే పార్టీలో పదవి ఇచ్చి గౌరవించాలని సందీప్ చెప్పినట్లు సమాచారం. వెంటనే జిల్లాల వారీగా పదవులు దక్కవలసిన వారి లిస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు గాంధీ భవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తెప్పించాలని సూచించినట్టు తెలిసింది. వచ్చే నెలలో నామినేటెడ్, పార్టీ పదవుల భర్తీ చేపట్టాలని, ఇంకా జాప్యం చేస్తే పార్టీకి నష్టం జరగవచ్చునని ఆయన అభిప్రాయపడినట్టు సమాచారం.

ప్రతి ఒక్కరికి నామినేటెడ్ పదవులు ఇవ్వలేమని, కీలకమైన నేతలకు మొదట నామినేటెడ్ పదవులు అప్పగించాలని, మిగిలిన వారికి పార్టీ పదవులు ఇచ్చి గౌరవించాలని సందీప్ చెప్పినట్లు తెలిసింది. రాష్ట్రస్థాయిలో కీలకమైన ఆర్టీసీ, మూసీ రివర్ ఫ్రంట్ తదితర కార్పొరేషన్ పదవులను సీనియర్ ఎమ్మెల్యేలతో భర్తీ చేయాలని నిర్ణయించినట్టు తెలిసింది. మిగిలిన సీనియర్ లీడర్లకు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ప్రచార కమిటీ, ఇతర అనుబంధ సంఘాల కీలక పదవులు, ఖాళీగా ఉన్న ఏఐసీసీ పదవులు ఇవ్వాలని నిర్ణయించారు. 

సందీప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కలిసిన ఎమ్మెల్యేలు... 

శుక్రవారం పలువురు సీనియర్ నేతలు గాంధీ భవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సందీప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్, విప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు వేముల వీరేశం, ఆది శ్రీనివాస్, ఎంపీలు సురేశ్ షెట్కార్, అనిల్ యాదవ్, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, ఎమ్మెల్యేలు మల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి రంగారెడ్డి, కేఆర్ నాగరాజు, రామ్మోహన్ రెడ్డి, మనోహర్ రెడ్డి, లక్ష్మారెడ్డి, మురళీ నాయక్, నాయిని రాజేందర్ రెడ్డి, నవీన్ యాదవ్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య తదితరులు ఉన్నారు.

నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి, ప్రభుత్వ పథకాల అమలు తీరు, జనంలో ప్రభుత్వం పట్ల ఉన్న అభిప్రాయం, మూడేండ్ల ప్రజాపాలనపై జనం మాట, జిల్లాలో, నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు, ముఖ్య నేతల మధ్య సమన్వయం, మళ్లీ అధికారంలోకి రావాలంటే ఇంకా ఏం చేయాలి? రాహుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ప్రధానిని చేసేందుకు పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్లాలి? అనే అంశాలపై ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చార్జీ సందీప్ ఆరా తీసినట్లు తెలిసింది. 

ముగిసిన రెండు రోజుల టూర్.. 

 ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చార్జి సందీప్ కుమార్ తన రెండ్రోజుల పర్యటనను ముగించుకొని శుక్రవారం సాయంత్రం బెంగళూరు వెళ్లిపోయారు. మళ్లీ ఆయన డిసెంబర్​3న హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రానున్నారు. వచ్చే నెల 15 తర్వాత ఆయన జిల్లాల్లో పర్యటించాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.