మెదక్, వెలుగు: మెదక్ పట్టణంలో దొంగలు ఓ ఇంట్లో నుంచి 30 తులాల బంగారాన్ని చోరీ చేసిన ఘటన గురువారం రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాపన్నపేట మండలం కొడపాక గ్రామానికి చెందిన భీమప్ప పట్టణంలోని వెంకట్రావునగర్కాలనీలో నివాసం ఉంటున్నాడు.
గురువారం సాయంత్రం ఇంటికి తాళం వేసి భార్య సరితతో కలిసి హైదరాబాద్‌లోని చిన్నకొడుకు దగ్గరకు వెళ్లారు. శుక్రవారం ఉదయం చుట్టుపక్కల వారు చూసి భీమప్పకు సమాచారం ఇవ్వడంతో ఇంటికి చేరుకున్న వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ మేరకు కేసు నమోదు చేసుకుని మెదక్ డీఎస్పీ ప్రసన్నకుమార్, క్లూస్‌టీమ్‌తో ఘటనా స్థలాన్ని పరిశీలించినట్లు సీఐ మహేశ్ తెలిపారు. బీరువాలోని 30 తులాల బంగారం చోరీకి గురైనట్లు పేర్కొన్నారు.
