ఏసీబీ వలలో సదాశివపేట మున్సిపల్ ఏఈ..రూ.15 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఆఫీసర్

ఏసీబీ వలలో సదాశివపేట మున్సిపల్ ఏఈ..రూ.15 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఆఫీసర్

సదాశివపేట, వెలుగు: లంచం తీసుకుంటూ ఓ మున్సిపల్ ఆఫీసర్​ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ ఘటన శుక్రవారం సంగారెడ్డి జిల్లా సదాశివపేట మున్సిపల్ కార్యాలయంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. 2025 సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వినాయక నిమజ్జనం సందర్భంగా ఊబ చెరువులో వేసిన విగ్రహాల ఐరన్ స్క్రాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను తొలగించే పనులకు సంబంధించి అక్టోబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నిర్వహించిన టెండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఓ కాంట్రాక్టర్ రూ.5.4 లక్షలకు దక్కించుకున్నాడు. 

పనులు పూర్తిచేసి బిల్లుల కోసం ఏవో ఆకుల రాజేష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సంప్రదించగా, బిల్లు చెల్లింపునకు రూ.15 వేలు లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఈ నెల 21న ఏసీబీని ఆశ్రయించాడు. పక్కాప్లాన్​తో ఏసీబీ అధికారులు, మార్క్ చేసిన కరెన్సీ నోట్లను బాధితుడికి అందించారు. వాటిని లంచంగా తీసుకుంటుండగా, ఆకుల రాజేష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హ్యాండెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా పట్టుకున్నారు. 

ఆయనతో పాటు సిబ్బంది శివారెడ్డిని కూడా అదుపులోకి తీసుకున్నారు. అనంతరం రాజేష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను విచారణ నిమిత్తం ఏసీబీ కార్యాలయానికి తరలించారు. ఈ దాడిలో మెదక్ రేంజ్ ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ రెడ్డి, ఎస్సైలు పాల్గొన్నారు.