హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని అవమానపరిచిన బీఆర్ఎస్ నాయకులకు తప్పకుండా బుద్ది చెబుతామని పీసీసీ ప్రధాన కార్యదర్శి చనగాని దయాకర్ హెచ్చరించారు. శుక్రవారం గాంధీ భవన్ లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. కేటీఆర్ కటౌట్లను పబ్బుల వద్ద, కేసీఆర్ ఫ్లెక్సీలను వైన్స్ ల వద్ద పెడతామని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ అశోక్ నగర్ వచ్చి, నిరుద్యోగుల సమస్యలు విని, వారితో కలిసి భోజనం చేశారని చెప్పారు. పదేండ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ ఏనాడైనా అక్కడికి వచ్చారా..? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పాలనలో తెలంగాణను పబ్బులు, లిక్కర్ షాపుల సంస్కృతిగా మార్చారని మండిపడ్డారు.
