హెచ్సీయూ సైకాలజీ స్టూడెంట్ఆత్మహత్యాయత్నం..రక్షించిన గచ్చిబౌలి పోలీసులు

హెచ్సీయూ సైకాలజీ స్టూడెంట్ఆత్మహత్యాయత్నం..రక్షించిన గచ్చిబౌలి పోలీసులు

గచ్చిబౌలి​​, వెలుగు : మానసిక ఒత్తిడితో హెచ్​సీయూలో సైకాలజీ చదువుతున్న స్టూడెంట్​ సూసైడ్ ​నోట్​రాసి ఆత్మహత్యకు యత్నించాడు.  గచ్చిబౌలి పోలీసులు సమయానికి వెళ్లి కాపాడారు. యూపీకి చెందిన అభినవ్​లక్రా(21) వర్సిటీలో ఎంఎస్సీ సైకాలజీ థర్డ్​ఇయర్​చదువుతూ ఎల్ ​మెన్స్ ​హాస్టల్​లో ఉంటున్నాడు. శుక్రవారం ఉదయం తన గదిలో సూసైడ్​ నోట్​రాసి కనిపించకుండా పోయాడు. 

తోటి విద్యార్థులు గచ్చిబౌలి పోలీసులకు సమాచారం ఇవ్వగా..వర్సిటీకి చేరుకున్న పోలీసులు ఎల్​ మెన్స్​ హాస్టల్​మూడో ఫ్లోర్​లో ఉన్నట్టు గుర్తించి కాపాడారు. తర్వాత వర్సిటీ వెల్ఫేర్​టీం సభ్యులకు అప్పగించారు. మానసిక ఒత్తిడితోనే 
అభినవ్​సూసైడ్​కు యత్నించినట్లు పోలీసులు గుర్తించారు.