హైదరాబాద్ సిటీ, వెలుగు: నగరంలోని సీవరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ల నిర్వహణలో లోపాలను సరిదిద్దుకోవడానికి నెల రోజుల గడువు ఇస్తున్నామని, ఆ తర్వాత వాటర్బోర్డు, మున్సిపల్ కార్పొరేషన్, పీసీబీలతో కలిసి తనిఖీలు నిర్వహిస్తామని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ హెచ్చరించారు. ఎస్‌టీపీ నిర్వాహకులు, గేటెడ్ కమ్యూనిటీల సంక్షేమ సంఘాల ప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులతో శుక్రవారం హైడ్రా ఆఫీసులో ఆయన సమావేశమయ్యారు.
గేటెడ్ కమ్యూనిటీలు, అపార్ట్‌మెంట్లు, వాణిజ్య సముదాయాల్లోని ఎస్‌టీపీలు నిరంతరం పనిచేయాలన్నారు. వాటి వివరాలను జలమండలి ప్లాట్‌ఫామ్‌లో నమోదు చేయాలన్నారు.
