బృందావన్ కాలనీలో..శ్రీ కాదంబిని డిజైనర్ షోరూమ్ ప్రారంభం

బృందావన్ కాలనీలో..శ్రీ కాదంబిని డిజైనర్ షోరూమ్ ప్రారంభం

హైదరాబాద్: కూకట్​పల్లి పరిధిలోని నిజాంపేట రోడ్డు బృందావన్​ కాలనీలో ఏర్పాటు చేసిన శ్రీ కాదంబిని డిజైనర్ సారీస్ షోరూమ్​ను మల్లారెడ్డి విశ్వ విద్యాపీఠ్​ వైస్ చైర్మన్ డా.ప్రీతిరెడ్డి ప్రారంభించారు. ఆ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భారతీయ సంప్రదాయ వస్త్రాల్లో చీరలకు ఉన్న ప్రత్యేక స్థానం గొప్పదని, సంప్రదాయ వైభవాన్ని ఆధునిక డిజైన్లతో మేళవిస్తూ మహిళల అభిరుచులకు అనుగుణంగా కలెక్షన్లను అందించడం అభినందనీయమన్నారు.

వివాహ వేడుకలు, పండుగలు, ప్రత్యేక సందర్భాలతో పాటు రోజువారీ సంప్రదాయ వస్త్రధారణను ఇష్టపడే మహిళల అభిరుచులకు అనుగుణంగా విభిన్న కలెక్షన్లను అందిస్తూ, భారతీయ సంప్రదాయ వస్త్రాలపై ఆసక్తి ఉన్న మహిళలకు ఒక ప్రత్యేక గమ్యస్థానంగా ఎదగాలని శ్రీ కాదంబిని డిజైనర్ సారీస్ ఆకాంక్షిస్తోందని నిర్వాహకురాలు దేవి తెలిపారు.