బుజ్జగింపు రాజకీయాలకు చెంపపెట్టు.. దీపతూన్పై సుప్రీం తీర్పును స్వాగతిస్తూ వీహెచ్పీ వ్యాఖ్య

బుజ్జగింపు రాజకీయాలకు చెంపపెట్టు.. దీపతూన్పై సుప్రీం తీర్పును స్వాగతిస్తూ వీహెచ్పీ వ్యాఖ్య

చెన్నై: తమిళనాడు మధురైలోని తిరుప్పరంకుండ్రం కొండపై ఉన్న దీపతూన్ రాతి స్తంభం వద్ద సంప్రదాయ కార్తీక దీపం వెలిగించాలని సుప్రీంకోర్టు శుక్రవారం ఇచ్చిన ఆదేశాలను విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) స్వాగతించింది. ఇది తమిళనాడు ప్రభుత్వ "బుజ్జగింపు రాజకీయాలకు తగిలిన పెద్ద చెంపపెట్టు" అని అభివర్ణించింది. 

సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేయడంలో రాష్ట్ర యంత్రాంగం పూర్తిగా విఫలమైందని వీహెచ్‌పీ సంయుక్త ప్రధాన కార్యదర్శి సురేంద్ర జైన్ ఆరోపించారు. దీనికి బాధ్యతవహిస్తూ సీఎం సి. జోసెఫ్ విజయ్ తక్షణమే రాజీనామా చేయాలని ఎక్స్ వేదికగా డిమాండ్ చేశారు. ఒకవేళ విజయ్ రాజీనామా చేయకపోతే..ఆయన ప్రభుత్వాన్ని వెంటనే సస్పెండ్ చేయాలని సురేంద్ర జైన్ కోరారు. 

ప్రభుత్వ యంత్రాంగం హిందూ విశ్వాసాలను అవమానిస్తోందని, ప్రభుత్వ చెర నుంచి హిందూ దేవాలయాలకు విముక్తి కల్పించాల్సిన అవసరం ఉందని తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాలను అపహాస్యం చేసే హక్కు ఎవరికీ లేదని స్పష్టం చేశారు.