గాంధీ డాక్టర్ల మరో ఘనత..వినికిడి లోపమున్న బాలుడికి రూ.12 లక్షల సర్జరీ

గాంధీ డాక్టర్ల మరో ఘనత..వినికిడి లోపమున్న బాలుడికి రూ.12 లక్షల సర్జరీ
  • త్వరలోనే మాట్లాడతాడన్న డాక్టర్లు 

పద్మారావు నగర్, వెలుగు: పుట్టుకతో వినికిడి లోపంతో మాటలు రాని ఎనిమిదేండ్ల బాలుడికి  గాంధీ డాక్టర్లు కొత్త జీవితాన్నిచ్చారు. నిజామాబాద్ జిల్లా బాన్సువాడకు చెందిన విహాన్ సాయికి  పుట్టుకతోనే చెవుడు ఉండడంతో మాటలు రాలేదు. కొద్ది రోజుల కింద కుటుంబసభ్యులు అతడిని గాంధీకి తీసుకువచ్చారు. పరీక్షలు చేసిన డాక్టర్లు అతడికి  క్లిష్టమైన కాక్లియర్​ ఇంప్లాంట్​ సర్జరీని విజయవంతంగా చేశారు. ఈ ఆపరేషన్​కు ప్రైవేటు దవాఖానల్లో రూ.10 నుంచి రూ.12 లక్షలు తీసుకుంటారు. ఆపరేషన్​ సక్సెస్​ కావడంతో ఇప్పుడు విహాన్​ వినగలుగుతున్నాడు. 

స్పీచ్ థెరపీ ద్వారా క్రమంగా శబ్దాలను గుర్తిస్తూ మాట్లాడటం నేర్చుకుంటాడని డాక్టర్లు చెప్పారు. కోలుకున్న  బాలుడిని శుక్రవారం డిశ్చార్జీ చేశారు. ఈఎన్టీ విభాగాధిపతి డాక్టర్ కే. నాగరాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆపరేషన్‌లో డాక్టర్లు రమేష్, రామ్జీ, అనస్థీషియా డాక్టర్ల టీమ్​శ్రీనివాస్ నాయక్, శివ కీలక పాత్ర పోషించారు.