గుజరాత్లో జైషే ఉగ్రవాది అరెస్ట్

గుజరాత్లో జైషే ఉగ్రవాది అరెస్ట్

అహ్మదాబాద్: గుజరాత్‌లో భారీ ఉగ్రవాద కుట్రను యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) అధికారులు భగ్నం చేశారు. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న నిషేధిత ఉగ్రవాద సంస్థ 'జైషే మహ్మద్'కు చెందిన 22 ఏండ్ల ఉగ్రవాదిని వడోదరలో అరెస్ట్ చేశారు. నిందితుడిని అస్సాంలోని కరీంగంజ్ జిల్లాకు చెందిన మహ్మద్ సహరుల్ ఇస్లాంగా గుర్తించారు. 

వడోదరలోని భారత వైమానిక దళ స్టేషన్‌పై దాడి చేసేందుకు అతడు కుట్ర పన్నినట్లు ఏటీఎస్ డీఐజీ సునీల్ జోషి శుక్రవారం మీడియాకు వెల్లడించారు. నిందితుడి వద్ద నుంచి ఒక ఏకే-47 రైఫిల్, 23 తూటాలు, జైషే మహ్మద్ జెండా, మొబైల్ ఫోన్లు, సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.