- మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ ఇన్‌చార్జి నీలం మధు ముదిరాజ్
మెదక్/పటాన్‌చెరు, వెలుగు: భారత రాజ్యాంగ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి నీలం మధు ముదిరాజ్ పిలుపునిచ్చారు. రాజ్యాంగం కల్పించిన హక్కులు, స్వేచ్ఛ, సమానత్వం, సామాజిక న్యాయం ప్రతి పౌరుడికి అందాలంటే రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుకోవాలన్నారు.
రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా గురువారం హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్ లిబర్టీ చౌరస్తా నుంచి నెక్లెస్ రోడ్‌లోని ఇందిరాగాంధీ విగ్రహం వరకు టీపీసీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన సంవిధాన్ రక్షక్ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు.
పటాన్‌చెరు నియోజకవర్గం నుంచి వందకు పైగా కార్లలో భారీ సంఖ్యలో కార్యకర్తలతో తరలివచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇన్‌చార్జి బి.ఎం.సందీప్, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో కలిసి ర్యాలీలో పాల్గొని రాజ్యాంగ పరిరక్షణకు సంఘీభావం తెలిపారు.
ఈ సందర్భంగా నీలం మధు మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని, రాజ్యాంగ హక్కులపై ప్రజల్లో అవగాహన కల్పించాలని కోరారు. కార్యక్రమంలో పటాన్‌చెరు నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
