2027 ఆస్ట్రేలియన్‌‌ ఓపెన్‌‌లో అర్జున్‌‌–సిద్ధాంత్‌‌కు వైల్డ్ కార్డ్‌‌

2027 ఆస్ట్రేలియన్‌‌ ఓపెన్‌‌లో అర్జున్‌‌–సిద్ధాంత్‌‌కు వైల్డ్ కార్డ్‌‌

చెంగ్డూ: ఇండియా టెన్నిస్‌‌ డబుల్స్‌‌ ప్లేయర్లు అర్జున్‌‌ ఖడే–సిద్ధాంత్‌‌ బాంతియాకు 2027 ఆస్ట్రేలియన్‌‌ ఓపెన్‌‌లో వైల్డ్ కార్డు ఎంట్రీ లభించింది. శుక్రవారం ముగిసిన ఆసియా పసిఫిక్‌‌ వైల్డ్‌‌ కార్డ్‌‌ ప్లే ఆఫ్స్‌‌లో ఈ ఇద్దరూ విజేతగా నిలిచారు. ఫైనల్లో రెండో సీడ్ ఇండియన్‌‌ జోడీ 7–6 (4), 6–4తో టాప్‌‌సీడ్‌‌ కైటో ఉయెసుగి–తకెరు యుజుకి (జపాన్‌‌)పై నెగ్గారు. 

అంతకుముందు సెమీస్‌‌లో ఖడే–బాంతియా 6–3, 6–2తో ప్రుచ్యా ఇసారో (థాయ్‌‌లాండ్‌‌)–ఖుయోయున్ సుల్తానోవ్ (ఉజ్బెకిస్తాన్‌‌)ను చిత్తు చేశారు. ఈ విజయంతో 25 ఏళ్ల సిద్ధాంత్‌‌ బాంతియా (ప్రపంచ 125వ ర్యాంక్‌‌) తన కెరీర్‌‌లో తొలిసారి గ్రాండ్‌‌స్లామ్‌‌ మెయిన్‌‌ డ్రా ఆడబోతున్నాడు. 

ఇండియా డబుల్స్‌‌ ఆటగాళ్లలో యూకీ బాంబ్రీ (47), శ్రీరామ్‌‌ బాలాజీ (50), నికీ పూనాచా (73), అనిరుధ్‌‌ చంద్రశేఖర్‌‌ (110) తర్వాత సిద్ధాంత్‌‌ ఐదో స్థానంలో ఉన్నాడు. మరోవైపు ఆరో ర్యాంకర్‌‌ అర్జున్‌‌ ఖడే (149) గత ఏడాది వింబుల్డన్‌‌, యూఎస్‌‌ ఓపెన్‌‌లలో ఆడినా.. ఆస్ట్రేలియన్‌‌ ఓపెన్‌‌ మెయిన్‌‌ డ్రాలో బరిలోకి దిగడం ఇదే ప్రథమం. వచ్చే ఏడాది జనవరి 17 నుంచి 31 వరకు మెల్‌‌బోర్న్‌‌లో ఆస్ట్రేలియన్‌‌ ఓపెన్‌‌ జరగనుంది.