విద్యార్థులందరికీ యూనిఫాంలు ఇచ్చినం..పీఎంయూ చైర్మన్ రవినాయక్

విద్యార్థులందరికీ యూనిఫాంలు ఇచ్చినం..పీఎంయూ చైర్మన్ రవినాయక్

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: ప్రభుత్వ విద్యాసంస్థల్లో వైట్ డ్రెస్​మినహా మిగతా రెండు జతల యూనిఫాంల పంపిణీ పూర్తయిందని ఎస్సీ గురుకుల సెక్రటరీ, ప్రాజెక్ట్​ మానిటరింగ్​యూనిట్​(పీఎంయూ) చైర్మన్​రవినాయక్​ తెలిపారు. ఇప్పటివరకు 54,59,030 జతల యూనిఫాం విద్యార్థులకు ఇచ్చినట్టు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 

ఈ విద్యాసంవత్సరం నుంచి స్టూడెంట్లకు అదనంగా తెల్ల యూనిఫాంను అందించాలని నిర్ణయించారని తెలిపారు. ఇప్పటివరకు 3,34,908 జతల తెల్ల యూనిఫాంలను సరఫరా చేయగా.. 57.60 శాతం పంపిణీ పూర్తయిందని వెల్లడించారు. 

మిగిలిన యూనిఫామ్‌‌‌‌‌‌‌‌ల పంపిణీని కూడా వారం రోజుల్లో పూర్తి చేస్తామని పేర్కొన్నారు. ప్రస్తుతం మిగిలిన యూనిఫామ్‌‌‌‌‌‌‌‌లకు సంబంధించి కుట్టు పనులు, విద్యార్థుల శరీర కొలతలకు అనుగుణంగా మార్పులు చేస్తున్నామని స్పష్టం చేశారు. సెల్ఫ్​హెల్ప్​గ్రూప్​లకు ఈ బాధ్యతలు అప్పగించినట్టు 
తెలిపారు.