కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్ (ఈఐఎల్) అసోసియేట్ ఇంజినీర్ (గ్రేడ్–I, గ్రేడ్–II) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
మొత్తం ఖాళీలు: 87.
విభాగాల వారీగా ఖాళీలు
అసోసియేట్ ఇంజినీర్ గ్రేడ్–I (5): ఎలక్ట్రికల్ 2, ఇనుస్ట్రుమెంటేషన్ 3.
అసోసియేట్ ఇంజినీర్ గ్రేడ్–II (82): ఎలక్ట్రికల్ 6, ఇనుస్టుమెంటేషన్ 3, పైపింగ్ 30, సివిల్ 6, స్ట్రక్చరల్ 12, సేఫ్టీ 3, ఎన్విరాన్మెంటల్ వర్క్స్ 1, ఎస్ఎంఈడీ 8, ఎఫ్ఈడీ 1, ఎఫ్ఈడీ–3 1, ప్రాసెస్–2 3, ప్రాసెస్ 2 అల్యూమినా 1.
విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో బీఈ/ బి.టెక్ పూర్తిచేసి ఉండాలి. 2 నుంచి ఐదేళ్ల ఉద్యోగ అనుభవం తప్పనిసరి.
వయసు: అసోసియేట్ ఇంజినీర్ గ్రేడ్ –I పోస్టులకు 32 ఏళ్లు, అసోసియేట్ ఇంజినీర్ గ్రేడ్–II పోస్టులకు 37 ఏళ్లు మించకూడదు. ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూబీడీలకు పదేళ్లు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
లాస్ట్ డేట్: డిసెంబర్ 9.
సెలెక్షన్ ప్రాసెస్: అప్లికేషన్ స్క్రీనింగ్, ఉద్యోగానుభవం ఆధారంగా షార్ట్ లిస్ట్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్సైట్ engineersindia.com ను సందర్శించవచ్చు.
– వెలుగు, ఎడ్యుకేషన్
