- మొదట జేఎన్‌టీయూ నుంచి రాయదుర్గ్ వరకు
- పోలీస్ కమిషనర్ రమేశ్
- రెండో రోజు కొనసాగిన సైబరాబాద్ మూవ్స్
గచ్చిబౌలి, వెలుగు : సైబరాబాద్‌లో ట్రాఫిక్, రవాణా వ్యవస్థ మెరుగుదల కోసం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సైబరాబాద్ మూవ్స్–2026 రెండో రోజు కొనసాగింది. టీ-హబ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో పలు అంశాల గురించి చర్చించారు. సైబరాబాద్సీపీ రమేశ్మాట్లాడుతూ పబ్లిక్ట్రాన్స్పోర్ట్వినియోగాన్ని పెంచడంతో పాటు ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు వారం రోజుల్లో కాంట్రా-ఫ్లో బస్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (బీఆర్టీఎస్) అమలు చేయాలని ప్లాన్చేస్తున్నట్టు చెప్పారు. ముందుగా జేఎన్‌టీయూ నుంచి రాయదుర్గ్ వరకు ఈ సేవలు మొదలయ్యేలా ప్రతిపాదనలు ఉన్నాయని చెప్పారు.
దీనివల్ల రద్దీ టైంలో ట్రాఫిక్ సమస్యను అధిగమించడంతో పాటు కేపీహెచ్‌బీ, హైటెక్ సిటీ, రాయదుర్గ్ మెట్రో స్టేషన్లకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించనున్నారు. రెండేళ్లలో బస్సుల సంఖ్యను 510కి పెంచాలని , ఐటీ ఉద్యోగుల కోసం ప్రత్యేక బస్సు సేవలను అందుబాటులోకి తీసుకురావాలనే ప్రపోజల్స్ఉన్నాయని ఆర్టీసీ అధికారులు చెప్పారు. అలాగే, సైబరాబాద్ పరిధిలోని వివిధ స్కూల్స్‌కు చెందిన విద్యార్థులతో కమిషనర్రమేశ్తో పాటు సీఎంసీ కమిషనర్ సృజన మాట్లాడారు. ప్రతి రోజు స్కూల్‌కు వెళ్లేప్పుడు ఎదుర్కొంటున్న ట్రాన్స్పోర్ట్సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
