తెలంగాణ విద్యుత్ రంగానికి సహకరించండి : భట్టి విక్రమార్క

తెలంగాణ విద్యుత్ రంగానికి  సహకరించండి : భట్టి విక్రమార్క
  • విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ వ్యవస్థల బలోపేతానికి సాయం చేయండి: భట్టి విక్రమార్క
  •  వేసవిలో విద్యుత్ కొరతను నివారించండి
  • అందుకు గ్యాస్ ఆధారిత విద్యుత్ కేంద్రాలను అందుబాటులో ఉంచండి
  • కేంద్రానికి రాష్ట్రాల విద్యుత్ శాఖ మంత్రుల సదస్సులో డిప్యూటీ సీఎం విజ్ఞప్తి

న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణలో పెరుగుతు న్న విద్యుత్ అవసరాలకు అనుగుణంగా విద్యుత్ ఉత్పత్తి, ప్రసార, పంపిణీ వ్యవస్థల మరింత బలోపేతానికి సహకరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిప్యూటీ సీఎం, విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క కోరారు. శుక్రవారం ఢిల్లీలోని అశోక హోటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కేంద్ర విద్యుత్, గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఆధ్వర్యంలో రాష్ట్రాల విద్యుత్ శాఖ మంత్రుల సదస్సు జరిగింది.

ఈ సదస్సులో డిప్యూటీ సీఎంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్, టీజీ ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కో సీఎండీ, డిప్యూటీ సీఎం ప్రత్యేక కార్యదర్శి కృష్ణ భాస్కర్ పాల్గొన్నారు. తెలంగాణ విద్యుత్ రంగానికి సంబంధించిన పలు కీలక అంశాలను డిప్యూటీ సీఎం కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వ విద్యుత్ వినియోగదారులకు స్మార్ట్ మీటర్ల ఏర్పాటు, విద్యుత్ పంపిణీ నష్టాల తగ్గింపు, వ్యవసాయ ఫీడర్ల సౌరీకరణ, ప్రభుత్వ విద్యుత్ బకాయిల చెల్లింపు, విద్యుత్ నిల్వ సామర్థ్యం పెంపు వంటి అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని తెలిపారు.

రివాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీమ్ (ఆర్డీఎస్ఎస్) కింద స్మార్ట్ మీటర్ల ఏర్పాటు, విద్యుత్ పంపిణీ నష్టాల తగ్గింపు, పంపిణీ వ్యవస్థల ఆధునికీకరణకు సంబంధించి రూ.25,096 కోట్ల విలువైన డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్)లను పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సమర్పించినట్లు తెలిపారు. ఈ పథకం కింద తెలంగాణకు ఇప్పటివరకు రూ.72 కోట్ల బడ్జెట్ సహాయం మాత్రమే అందిందని పేర్కొన్నారు. పెండింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్న డీపీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లకు 60 రోజుల్లో ఆమోదం తెలపడంతో పాటు 2028 మార్చి 31 వరకు పనుల అమలుకు పూర్తి గడువు కల్పించాలని కోరారు.

పునరుత్పాదక విద్యుత్ సామర్థ్యాన్ని పెంచాలి...

ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నినో ప్రభావంతో ఈ ఏడాది సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జలవిద్యుత్ ఉత్పత్తి గతేడాదితో పోలిస్తే సుమారు 20 శాతం తగ్గిందన్నారు. అందువల్ల బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి 13.3 శాతం పెరిగిందని వివరించారు. ఈ నేపథ్యంలో విద్యుత్ నిల్వ వ్యవస్థలతో కూడిన పునరుత్పాదక విద్యుత్ సామర్థ్యాన్ని వేగంగా పెంచాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రికి సూచించారు.

అలాగే, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు చేపట్టే పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులకు మెగావాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రూ.కోటి చొప్పున వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ అందించాలని కోరారు. టీజీజెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కో చేపట్టనున్న కల్లూరు పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టుకు కేంద్ర విద్యుత్ ప్రాధికార సంస్థ (సీఈఏ) త్వరితగతిన ఆమోదం తెలిపేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుతం టెండర్లు చేపట్టిన 2,000 మెగావాట్ అవర్ల బ్యాటరీ విద్యుత్ నిల్వ ప్రాజెక్టులకు కూడా కేంద్ర ఆర్థిక సహాయం అందించాలని కోరారు.

రాష్ట్ర ప్రభుత్వ పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులకు ఆర్థిక సహాయం విజ్ఞప్తిపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించడంపై కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాకుండా రానున్న వేసవిలో విద్యుత్ డిమాండ్ పెరిగే అవకాశం ఉన్నందున, 2027 ఫిబ్రవరి 1– ఏప్రిల్ 30 వరకు దేశంలోని అన్ని గ్యాస్ ఆధారిత విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను అందుబాటులోకి తెవాలని కోరారు. 

అంతర్రాష్ట్ర విద్యుత్ ప్రసార చార్జీల్లో పారదర్శకత అవసరం..

అంతర్రాష్ట్ర విద్యుత్ ప్రసారానికి సంబంధించిన జనరల్ నెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వర్క్ యాక్సెస్ (జీఎన్ఏ) విధానంతో ప్రసార చార్జీల్లో భారీ హెచ్చుతగ్గులు రాష్ట్రాల ఆర్థిక ప్రణాళికపై ప్రభావం చూపుతున్నాయని భట్టి వివరించారు. తెలంగాణకు 5,801 మెగావాట్ల నెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వర్క్ యాక్సెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఎలాంటి మార్పు లేకపోయినప్పటికీ, 2025 అక్టోబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రూ.195 కోట్లు, నవంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రూ.145 కోట్ల మేర ప్రసార చార్జీలు విధించారని తెలిపారు.

దక్షిణ భారతదేశానికి 6,000 మెగావాట్ల విద్యుత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అందించే రాయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గఢ్- – పుగళూర్ -త్రిస్సూర్ హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వీడీసీ విద్యుత్ ప్రసార వ్యవస్థకు పూర్తిస్థాయిలో జాతీయ హోదా కల్పించాలని భట్టి కోరారు. తెలంగాణ విద్యుత్ ప్రసార ప్రణాళికలో భాగమైన 23,480 ఎంవీఏ సామర్థ్యం గల గ్రీన్ ఎనర్జీ కారిడార్ ప్రాజెక్టులకు తొలి విడతలోనే ఆమోదం తెలపాలన్నారు.

కర్నాటకలోని సేడం నుంచి తెలంగాణలోని పరిగి వరకు నిర్మించనున్న 400 కేవీ డబుల్ సర్క్యూట్ విద్యుత్ ప్రసార లైన్, 765/400 కేవీ మహేశ్వరం–2 సబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టేషన్ ప్రాజెక్టులను అంతర్రాష్ట్ర విద్యుత్ ప్రసార ప్రాజెక్టులుగా చేపట్టి, వాటి వ్యయాన్ని జాతీయ స్థాయిలో పంచుకునేలా చర్యలు తీసుకోవాలని కోరారు. పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టులకు ప్రస్తుతం అమలులో ఉన్న అంతర్రాష్ట్ర విద్యుత్ ప్రసార చార్జీల దశలవారీ మినహాయింపు గడువు 2028 జూన్ 30తో ముగుస్తోందని, అయితే ప్రస్తుతం టెండర్ల దశలో ఉన్న ప్రాజెక్టులు 2029 ఫిబ్రవరి నుంచి అందుబాటులోకి రానున్నాయని తెలిపారు.