బీఆర్ అంబేద్కర్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ కుసీఐఐ గోల్డ్ విన్నర్ అవార్డు

బీఆర్ అంబేద్కర్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ కుసీఐఐ గోల్డ్ విన్నర్ అవార్డు

న్యూఢిల్లీ, వెలుగు: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ కు ప్రతిష్టాత్మకమైన కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) అవార్డు వరించింది. శుక్రవారం ఢిల్లీలో ఇండస్ట్రీ–అకాడెమియా పార్ట్ నర్ షిప్ అండ్ టెక్నాలజీ అంశంపై గ్లోబల్ సమిట్ ను నిర్వహించింది.

ఈ సందర్భంగా దేశంలో పరిశ్రమ–విద్యా సంస్థల సహకారం, ఆవిష్కరణలు, వ్యవస్థాపకత, ఉన్నత విద్య వంటి విభాగాల్లో అవార్డులను ప్రకటించింది. ఇందులో ప్రైవేట్ కేటగిరీలో గోల్డ్ విన్నర్ గా నిలిచింది. విద్యా సంస్థ ప్రతినిధిగా రమణ ఈ అవార్డును స్వీకరించారు.