రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కు ‘బ్రెయిన్ చోరీ’ జరిగినట్టుంది : బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ రాంచందర్ రావు

రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కు ‘బ్రెయిన్ చోరీ’ జరిగినట్టుంది :  బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ రాంచందర్ రావు
  • బీజేపీ ఎక్కడుందంటూ సీఎం చేసిన వ్యాఖ్యలపై రాంచందర్ రావు సెటైర్

హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డిని గాంధీ కుటుంబానికి బానిస అనుకున్నామని, కానీ ఆయన వ్యాఖ్యలు విన్నాక బ్రెయిన్ చోరీ కూడా జరిగినట్టుందని బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ రాంచందర్ రావు విమర్శించారు. 6 గ్యారంటీలు, 420 హామీల అమలులో వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే బీజేపీపై రాజకీయ విమర్శలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

రాష్ట్రంలో బీజేపీ ఎక్కడుందంటూ సీఎం చేసిన వ్యాఖ్యలపై ‘ఎక్స్’  వేదికగా శుక్రవారం రాంచందర్ రావు స్పందించారు. కామారెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చేతిలో ఓడిపోయి మూడో స్థానానికి పరిమితమైన విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి మర్చిపోయారా అని ఆయన ప్రశ్నించారు. గతంలో రేవంత్ ప్రాతినిధ్యం వహించిన మల్కాజిగిరి పార్లమెంట్ స్థానంలోనూ బీజేపీ గెలిచిందని గుర్తుచేశారు. ఆయన ఎమ్మెల్యేగా ఉన్న నియోజకవర్గం పరిధిలోని మహబూబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్ పార్లమెంట్ స్థానాన్ని కూడా బీజేపీ గెలుచుకుందని పేర్కొన్నారు.

ఇన్ని విజయాలు సాధించినా తెలంగాణలో బీజేపీ ఎక్కడుందని సీఎం ప్రశ్నించడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. బీజేపీ కార్యకర్తలను కించపరుస్తూ రేవంత్ చేసిన వ్యాఖ్యలు ఆయన అహంకారానికి నిదర్శనమన్నారు. 6 గ్యారంటీలు, 420 హామీల వైఫల్యాలపై సీఎం రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని రాంచందర్ రావు డిమాండ్ చేశారు.

రాష్ట్రంలో విద్యార్థుల ఫుడ్ పాయిజన్ మరణాలు, రైతుల ఆత్మహత్యలు, పెన్షన్లు, రిటైర్మెంట్ బకాయిలు, ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్, ఆలయాల కూల్చివేతలపై ప్రజలకు జవాబు చెప్పాలన్నారు. రేవంత్ పాలనతోనే తెలంగాణలో కాంగ్రెస్ పతనం మొదలవుతుందని, రాష్ట్రంలోనూ కాంగ్రెస్ ముక్త్ పాలన రావడం ఖాయమని ఆయన పేర్కొన్నారు.