ఈవారం పెరుగుతూ వచ్చిన బంగారం రేట్లకు శనివారం రోజున బ్రేక్ పడింది. అవును గత రెండు రోజులుగా పెరిగిన బంగారం, వెండి ధరలు శనివారం కూల్ అయ్యాయి. ఈ క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో షాపింగ్ చేయాలనుకుంటున్న ప్రజలు తమ రిటైల్ విక్రయ ధరలను ముందుగా పరిశీలించటం బెటర్.
హైదరాబాద్లో 2026, నవంబర్ 28వ తేదీ బంగారం ధరలు ఇలా ఉన్నాయి :
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర : లక్షా 27 వేల 860 రూపాయలు
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర : లక్షా 17 వేల 200 రూపాయలు
18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర : 95 వేల 890రూపాయలు
ఇక వెండి ధర విషయానికి వస్తే.. హైదరాబాద్ సిటీలో కిలో వెండి : లక్షా 70 వేల రూపాయలు
నవంబర్ 28న బంగారం రేట్లు తగ్గాయి. 24 క్యారెట్ల బంగారం రేటు 10 గ్రాముకు 540 రూపాయలు తగ్గింది. దీంతో హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు రూ.12వేల 786గా కొనసాగుతోంది. శనివారం రోజున రూ.లక్షా 27వేల 860కి చేరుకుంది. అలాగే ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.11వేల 720గా కొనసాగుతోంది. అంటే 10 గ్రాముల బంగారం రేటు అంటే తులం రూ.లక్షా 17 వేల 200 వద్ద అమ్మకాలు జరుగుతున్నాయి.
శనివారం రోజున వెండి రేట్ల విషయానికి వస్తే.. నవంబర్ 28, 2026న దేశవ్యాప్తంగా స్థిరంగా కొనసాగుతున్నాయి. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కూడా స్వచ్ఛమైన వెండి కేజీకి రూ.లక్షా 70వేలుగా కొనసాగుతోంది. అంటే గ్రాము దాదాపు రూ.170 దగ్గర ఉంది.
