హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్‌లోని హైటెక్స్ వేదికగా మూడు రోజుల పాటు నిర్వహించిన 18వ ‘పౌల్ట్రీ ఇండియా’ ఎగ్జిబిషన్‌కు విశేష స్పందన లభించిందని పౌల్ట్రీ ఇండియా అధ్యక్షుడు ఉదయ్ సింగ్ బయాస్ తెలిపారు. ఈ ప్రదర్శనకు సుమారు 60 వేల మంది సందర్శకులు హాజరైనట్లు ఆయన వెల్లడించారు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాలు, విదేశాల నుంచి కూడా పౌల్ట్రీ రైతులు, పరిశ్రమ ప్రతినిధులు, వ్యాపారవేత్తలు, నిపుణులు పెద్ద సంఖ్యలో ఈ ఎగ్జిబిషన్‌ను సందర్శించారు.
