రెండు రోజుల లాభాలకు బ్రేక్.. సెన్సెక్స్ 989 పాయింట్లు డౌన్..25,600 వద్ద నిఫ్టీ

రెండు రోజుల లాభాలకు బ్రేక్.. సెన్సెక్స్ 989 పాయింట్లు డౌన్..25,600 వద్ద నిఫ్టీ

ముంబై: రెండు రోజుల వరుస లాభాల తర్వాత దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీగా నష్టపోయాయి. ఇటీవల లాభపడిన ఐటీ, బ్యాంకింగ్ షేర్లలో ఇన్వెస్టర్లు ప్రాఫిట్స్ బుక్ చేయడం, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు మళ్లీ పెరగడం మార్కెట్లను కిందకు లాగాయి. వీటికి తోడు రూపాయి బలహీనపడటం, అమెరికా సుంకాలపై అనిశ్చితి ఇన్వెస్టర్లను ఆందోళనకు గురిచేశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 989.33 పాయింట్లు నష్టపోయి 83,339.26 వద్ద, నిఫ్టీ 277.30 పాయింట్లు పడిపోయి 25,607.20 వద్ద స్థిరపడ్డాయి. 

 పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు పెరగడంతో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌‌కు 97.22 డాలర్లకు చేరింది.  డాలర్‌‌‌‌తో రూపాయి విలువ 92.99 దగ్గర ఉంది. సెన్సెక్స్‌‌లో  హెచ్‌‌సీఎల్ టెక్, ఇన్ఫోసిస్, టీసీఎస్, బజాజ్ ఫిన్‌‌సర్వ్, టెక్ మహీంద్రా, యాక్సిస్ బ్యాంక్ షేర్లు శుక్రవారం భారీగా నష్టపోగా.. భారత్ ఎలక్ట్రానిక్స్, టైటాన్, ఇండిగో (ఇంటర్‌‌గ్లోబ్), టాటా స్టీల్ షేర్లు లాభపడ్డాయి.