గచ్చిబౌలి, వెలుగు : జిమ్‌కి వచ్చే మహిళపై లైంగిక దాడి చేయడంతో పాటు కుటుంబ పరువు తీస్తామని బెదిరించిన కేసులో ఓ జిమ్ట్రైనర్కు కోర్టు ఏకంగా 20 ఏండ్ల జైలు శిక్ష, విధించింది. మెహిదీపట్నం జ్యోతినగర్‌కు చెందిన మహ్మద్ మౌజమ్ అలీ (39) గచ్చిబౌలి రాంకీ టవర్స్‌లో జిమ్ ఫిట్‌నెస్ ట్రైనర్. ఈ జిమ్‌కు వచ్చే మహిళ(41)పై 2015 జనవరి నుంచి జిమ్‌లోని మహిళల టాయిలెట్‌లో పలుమార్లు లైంగిక దాడి చేశాడు. బాధితురాలి ఫ్లాట్‌కి వెళ్లి లైంగికంగా వేధించాడు. భర్తకు విషయం చెప్తే పరువు తీస్తానని బెదిరించాడు.
ఆమె మొబైల్, సోషల్ మీడియా ఖాతాలను హ్యాక్ చేసి, ఫొటోలు తీసుకొని బ్లాక్మెయిల్చేశాడు. ఈ వేధింపులు భరించలేక తన భర్తకు విషయం చెప్పి తర్వాత రాయదుర్గం పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు సీసీటీవీ ఫుటేజీతో పాటు ఇతర ఆధారాలను కోర్టుకు సమర్పించడంతో ఎల్బీనగర్లోని రంగారెడ్డి జిల్లా13వ అదనపు జిల్లా, సెషన్స్ జడ్జి ఎం. వాణి నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.8 వేల జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చారు.
