తుర్కపల్లిలోని బీసీ గురుకుల క్రీడలు ప్రారంభించిన పొన్నం

తుర్కపల్లిలోని బీసీ గురుకుల క్రీడలు ప్రారంభించిన పొన్నం

శామీర్ పేట వెలుగు : తుర్కపల్లిలోని జ్యోతిబా ఫూలే తెలంగాణ బీసీ సంక్షేమ గురుకుల బాలుర పాఠశాల, జూనియర్ కళాశాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి క్రీడలను శుక్రవారం మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ఎమ్మెల్యే మల్లారెడ్డితో కలిసి వాలీబాల్ ఆడారు. 

మంత్రి మాట్లాడుతూ గురుకుల విద్యార్థుల్లోని క్రీడా ప్రతిభను వెలికితీసి రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని తెలిపారు. డిసెంబర్ 11 నుంచి రాష్ట్రవ్యాప్తంగా గ్రామస్థాయిలో 'ఖేలో ఇండియా' క్రీడా ఉత్సవాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. కలెక్టర్ మను చౌదరి, ఇతర అధికారులు పాల్గొన్నారు.