బూర్గులలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ కు శంకుస్థాపన..

బూర్గులలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ కు శంకుస్థాపన..
  • పాల్గొన్న మంత్రి శ్రీధర్​బాబు 

షాద్ నగర్, వెలుగు : షాద్​నగర్​నియోజకవర్గం ఫరూఖ్​నగర్​మండలం బూర్గులలో రూ.10 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న తెలంగాణ పబ్లిక్ స్కూల్, లింగారెడ్డిగూడలో రూ.29.70 కోట్లతో పాలిటెక్నిక్ కళాశాల నిర్మాణ పనులకు మంత్రి శ్రీధర్​బాబు శుక్రవారం శంకుస్థాపన చేశారు. 

మంత్రి మాట్లాడుతూ హైదరాబాద్​స్టేట్​తొలి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు పుట్టిన ఊరిలో ఆయనకు నివాళిగా రాష్ట్రంలోనే మొట్టమొదటి తెలంగాణ పబ్లిక్ స్కూల్​ను బూర్గులలో ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. పాలిటెక్నిక్ తర్వాత ఇంజినీరింగ్ సెకండియర్​(లేటరల్ ఎంట్రీ) ప్రవేశం యథాతథంగా కొనసాగుతుందని, ప్రతిపక్షాల అసత్య ప్రచారాలను నమ్మవద్దన్నారు. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.