ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతికి ఆర్థిక స్వావలంబనే లక్ష్యం : మంత్రి అడ్లూరి లక్ష్మణ్

ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతికి ఆర్థిక స్వావలంబనే లక్ష్యం : మంత్రి అడ్లూరి లక్ష్మణ్
  • ఎస్ డీ ఎఫ్ నిధుల రివ్యూ లో మంత్రి అడ్లూరి లక్ష్మణ్​

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు:  రాష్ట్రంలోని షెడ్యూల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కులాలు, షెడ్యూల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తెగల అభ్యున్నతిని కేవలం సంక్షేమ పథకాల అమలుకే పరిమితం చేయవద్దని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సూచించారు.  ఆ వర్గాల కుటుంబాలకు శాశ్వత ఆదాయ మార్గాలు, మెరుగైన విద్య, ఉపాధి అవకాశాలు, ఆర్థిక స్వావలంబన కల్పించడమే ప్రజా ప్రభుత్వ ప్రధాన ప్రాధాన్యమనన్నారు. ఎస్సీ, ఎస్టీ ఎస్డీఎఫ్ నిధుల వినియోగం, శాఖల వారీగా అమలవుతున్న పథకాలు, పెండింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రతిపాదనలు, అభివృద్ధి కార్యక్రమాల పురోగతిపై  మంత్రి శుక్రవారం సచివాలయంలో నోడల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఏజెన్సీ రివ్యూ చేపట్టారు.

ఈ సమావేశంలో వ్యవసాయం, పశుసంవర్ధక, మత్స్య, నీటిపారుదల,  ఆయకట్టు అభివృద్ధి, రవాణా, రోడ్లు–భవనాలు, ప్రణాళిక, బలహీన వర్గాల గృహ నిర్మాణం, ఇంధన, పౌరసరఫరాలు, పరిశ్రమలు–వాణిజ్యం, మాధ్యమిక విద్య, ఉన్నత విద్య, వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమం, మహిళా–శిశు సంక్షేమం, దివ్యాంగులు, వయోవృద్ధులు, ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జెండర్ల సంక్షేమం, కార్మిక–ఉపాధి, పురపాలక–పట్టణాభివృద్ధిపంచాయతీరాజ్–గ్రామీణాభివృద్ధి, షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి, గిరిజన సంక్షేమ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మంత్రి అడ్లూరి మాట్లాడుతూ నిధుల  కేటాయింపులు కాగితాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో ఫలితాలు కనిపించాలన్నారు.