టోల్ చార్జీలు ఎగ్గొడితే 5 రెట్లు ఫైన్

టోల్ చార్జీలు ఎగ్గొడితే 5 రెట్లు ఫైన్

న్యూఢిల్లీ: ఫాస్ట్‌‌ట్యాగ్‌‌ టోల్‌‌ చార్జీలు చెల్లించకుండా తప్పించుకునేందుకు వాహనాల నంబర్‌‌ ప్లేట్లను ఉద్దేశపూర్వకంగా కప్పిఉంచినా, మార్చినా ఇకపై భారీ జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఇలాంటి వాహనదారులపై టోల్‌‌ రుసుముకు అదనంగా 5 రెట్లు జరిమానా విధించాలని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ నిర్ణయించింది.  మల్టీ లేన్‌‌ ఫ్రీ ఫ్లో (ఎంఎల్‌‌ఎఫ్‌‌ఎఫ్‌‌) టోల్‌‌ విధానం అమల్లో ఉన్న ప్రాంతాల్లో ఈ నిబంధన వర్తిస్తుంది. 

వాహనం ముందు లేదా వెనుక నంబర్‌‌ ప్లేటును కప్పడం, తారుమారు చేయడం, దాచడం, ఫాస్ట్‌‌ట్యాగ్‌‌ ఏర్పాటు చేయకపోవడం ద్వారా టోల్‌‌ చెల్లింపును తప్పించుకోవాలని ప్రయత్నించినట్లు నిర్ధారణ అయితే జరిమానా విధిస్తారు. ఇందుకోసం సాంకేతిక పరిజ్ఞానంతో వాహనాలను గుర్తిస్తారు. ఎంఎల్‌‌ఎఫ్‌‌ఎఫ్‌‌ విధానంలో రహదారిపై వాహనాలు ఆగాల్సిన అవసరం లేకుండా కెమెరాలు, ఫాస్ట్‌‌ట్యాగ్‌‌ రీడర్ల ద్వారా టోల్‌‌ వసూలు చేస్తారు.