పర్మిషన్ లేకుండా ఆఫీస్ ఖాతా నుంచి మనీ ట్రాన్స్ ఫర్..తల్లికి వీడియో పంపి యువకుడు ఆత్మహత్య

పర్మిషన్  లేకుండా ఆఫీస్ ఖాతా నుంచి  మనీ ట్రాన్స్ ఫర్..తల్లికి వీడియో పంపి యువకుడు ఆత్మహత్య

పోచారం: ఉద్యోగం చేస్తున్న సంస్థలో నగదు, సెల్‌ఫోన్ తీసుకెళ్లడంతోపాటు, ఫోన్‌పే ద్వారా రూ.99,999 తన ఖాతాకు బదిలీ చేసుకున్నాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా పోచారం ఐటీ కారిడార్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జగద్గిరిగుట్ట ఆల్విన్ కాలనీకి చెందిన కోట సాయిరామ్ (29) గుంటూరులోని ఓ ప్రైవేట్ థియేటర్‌లో కస్టమర్ కేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. తన తండ్రి ఆరోగ్యం బాగోలేదని చెప్పి యజమాని వద్ద రూ.10 వేలు తీసుకున్నాడు. అనంతరం కార్యాలయానికి చెందిన సెల్‌ఫోన్‌తోపాటు రూ.6 వేల నగదును యజమానికి తెలియకుండా తీసుకెళ్లినట్లు ఆరోపణలు ఉన్నాయి.

అంతేకాకుండా కార్యాలయ ఫోన్‌పే ఖాతా నుంచి రూ.99,999 తన వ్యక్తిగత బ్యాంకు ఖాతాకు బదిలీ చేసుకున్నట్లు యజమాని మహీంద్రా సాయిరామ్ తల్లి వనజలక్ష్మికి ఫోన్ చేసి సమాచారం ఇచ్చాడు. ఈ వ్యవహారంపై సైబర్ క్రైమ్ పోర్టల్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు సాయిరామ్ బ్యాంకు ఖాతాను ఫ్రీజ్ చేశారు.

తన బ్యాంకు ఖాతా ఫ్రీజ్ అయిన విషయం తెలుసుకున్న సాయిరామ్ శుక్రవారం ఉదయం తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు వీడియో తీసి తల్లికి, యజమానికి పంపించాడు. తాను చౌదరిగూడలోని ఓయూ కాలనీ లివింగ్ ట్రీ హోటల్‌లో ఉన్నట్లు, గది నంబరు 201 లొకేషన్‌ను కూడా పంపించాడు.