జ్యోతిష్యుడు చెప్పాడని లాటరీ కొని దుబాయ్లో కోటీశ్వరుడు అయిన తమిళనాడు యువకుడు

జ్యోతిష్యుడు చెప్పాడని లాటరీ కొని దుబాయ్లో కోటీశ్వరుడు అయిన తమిళనాడు యువకుడు

తంతే బూరెల బుట్టలో పడటం అంటే ఇదే కావచ్చు.  లేకపోతే జ్యోతిష్యుడు చెప్పడమేంటి.. లాటరీ టికెట్ కొనటమేంటి..? అదృష్ట దేవత ఎదురు తగిలినట్లుగా రాత్రికి రాత్రే కోటిశ్వరుడు కావడమేంటి.. ?  ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగే.. ఎక్కడో ఉద్యోగం చేస్తున్న ఓ యువకుడిని రాత్రికి రాత్రి కోటీశ్వరుడిని చేసింది అదృష్టం. ఓ జ్యోతిష్యుడు చెప్పాడని.. ఆ యువకుడు కొన్న లాటరీకి డబ్బులు రావటం ఏంటీ.. అది కూడా దేశం కాని దేశంలో.. ఈ ఇంట్రస్టింగ్ విషయాలను పూర్తిగా తెలుసుకుందామా.. 

తమిళనాడుకు చెందిన ఇంజనీర్ అరవిందన్ కె. ‘బిగ్ టికెట్’ లాటరీలో 25 వేల ధీరామ్స్ నగదు బహుమతి గెలుచుకున్నారు. దక్షిణ భారత జ్యోతిష్యం ఆధారంగా ఎంచుకున్న టికెట్ నంబర్ ఆయనకు ఈ అదృష్టాన్ని తెచ్చిపెట్టింది. 2026 నవంబర్ మూడో వారంతపు ఈ-డ్రాలో 35 ఏళ్ల అరవిందన్ విజేతగా నిలిచారు. తన సోదరుడితో కలిసి ఈ టికెట్ కొనుగోలు చేసినట్లు ఆయన చెప్పారు. సాధారణంగా స్నేహితులతో కలిసి టికెట్లు కొనే ఆయన, ఈసారి సోదరుడితో కలిసి తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. 

ఈ గెలుపు తన కుటుంబానికి ఎంతో ముఖ్యమని అరవిందన్ తెలిపారు. తన తల్లి వైద్య ఖర్చుల కోసం ఆర్థిక సాయం అవసరమైన సమయంలో ఈ నగదు లభించిందని ఆయన చెప్పారు. గెలుచుకున్న బహుమతి మొత్తాన్ని తన సోదరుడితో పంచుకోనున్నట్లు వెల్లడించారు.

గత ఏడాది అబుదాబిలో ఆరు నెలల పాటు పని చేసిన సమయంలో సహచరుల ద్వారా అరవిందన్ ‘బిగ్ టికెట్’ గురించి తెలుసుకున్నారు. అప్పటి నుంచి ఆయన క్రమం తప్పకుండా టికెట్లు కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న తన స్నేహితులతో కలిసి భవిష్యత్తులో గెలుపును పంచుకోవాలని ఆశిస్తున్నట్లు అరవిందన్ పేర్కొన్నారు.

అరవిందన్ తో పాటు మరో ముగ్గురు భారతీయులు కూడా ఈ డ్రాలో నగదు బహుమతులు గెలుచుకున్నారు. షార్జాలో నివసిస్తున్న మకరంద్ నివృత్తి పాటిల్ (నంబర్ 237774), యూఏఈలో ఉంటున్న షరఫుద్దీన్ కాసిమ్ (నంబర్ 429676) విజేతలుగా నిలిచారు. అబుదాబిలో క్వాలిటీ కంట్రోల్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న ప్రీతి ఆంటో ఆంటోనీ అంతిక్కాట్ వాక్కో (నంబర్ 115349) కూడా 25 వేల ధీరామ్స్ గెలుచుకున్నారు.

గెలుపు వార్త విన్నప్పుడు ప్రీతి ఎంతో భావోద్వేగానికి గురయ్యారు. ‘బిగ్ టికెట్’ ప్రతినిధి బుష్రా నుంచి వచ్చిన ఫోన్ కాల్ తనను ఆశ్చర్యానికి గురిచేసిందని ఆమె చెప్పారు. నవంబర్ ప్రమోషన్‌లో భాగంగా డిసెంబర్ 3న జరిగే డ్రాలో 25 మిలియన్ ధీరామ్స్ గ్రాండ్ ప్రైజ్ విజేతను ప్రకటిస్తామని సంస్థ ప్రతినిధులు తెలిపారు.