20వ సీజన్‌కు నేను రెడీ, పల్టాన్‌కు పండగే.. కెప్టెన్గా రీఎంట్రీ తర్వాత రోహిత్ ఫస్ట్ రియాక్షన్

20వ సీజన్‌కు నేను రెడీ, పల్టాన్‌కు పండగే.. కెప్టెన్గా రీఎంట్రీ తర్వాత రోహిత్ ఫస్ట్ రియాక్షన్

Rohit Sharma : ముంబై ఇండియన్స్ (Mumbai Indians) అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మెగా అనౌన్స్‌మెంట్ వచ్చేసింది. కెప్టెన్సీ నుంచి తప్పించిన సరిగ్గా మూడేళ్ల తర్వాత రోహిత్ శర్మ (Rohit Sharma) మళ్లీ ముంబై కెప్టెన్‌గా తిరిగొచ్చాడు. IPL 2027 (20వ సీజన్)లో ఐదుసార్లు ఛాంపియన్ అయిన ఎంఐను హిట్‌మ్యాన్ ముందుండి నడిపించనున్నాడు. 2023లో హార్దిక్ పాండ్యా తిరిగి ముంబైలోకి వచ్చాక రోహిత్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించిన విషయం తెలిసిందే. 3 సీజన్ల పాటు ముంబై ఇండియన్స్ కి నాయకత్వం వహించిన హార్దిక్ పాండ్యాను పంజాబ్ కింగ్స్ (PBKS)కు ట్రేడ్ చేసిన ముంబై, టైటిల్ కొట్టడం కోసం మళ్లీ తమ కెప్టెన్సీ బాధ్యతలను రోహిత్కే అప్పగించింది. మే 2023 తర్వాత హిట్‌మ్యాన్ మళ్లీ ఒక ఐపీఎల్ జట్టుకు కెప్టెన్‌గా బరిలోకి దిగబోతున్నాడు.

20వ సీజన్‌కు నేను రెడీ.. పల్టాన్‌కు పండగే: రోహిత్ శర్మ

* ముంబై నా జీవితంలో భాగం: ముంబై ఇండియన్స్ నా జీవితంలో ఒక పెద్ద భాగం.. ఈ జట్టుకు నాయకత్వం వహించడం నాకు ఎప్పుడూ ఎంతో గర్వకారణం.. రాబోయే సీజన్ గురించి నీతా భాభీ, ఆకాశ్‌లతో జరిగిన చర్చలు ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చాయి.. మనం ఏం సాధించగలమో నాకు పూర్తి నమ్మకం ఉందని రోహిత్ పేర్కొన్నాడు.

* పల్టాన్‌కు హామీ: 20వ సీజన్‌కు, ముందున్న సవాళ్లకు, మా పల్టాన్ (అభిమానులు) సంబరాలు చేసుకునే ఎన్నో క్షణాలను అందించడానికి నేను సిద్ధంగా ఉన్నాను.. మా బ్రాండ్ ఆఫ్ క్రికెట్ ఆడటం, కలిసి పోరాడటం, ఆటను ఆస్వాదించడంపైనే మా దృష్టి ఉంటుందని హిట్‌మ్యాన్ స్పష్టం చేశాడు.

జట్టును రోహిత్ నడిపించడం సంతోషం: ఆకాశ్ అంబానీ

* 2011లో ముంబై ఇండియన్స్‌లో చేరినప్పటి నుంచి జట్టుతో కొనసాగుతున్న రోహిత్ శర్మ తిరిగి కెప్టెన్ కావడంపై ముంబై ఇండియన్స్ ఓనర్ ఆకాశ్ అంబానీ (Aakash Ambani) హర్షం వ్యక్తం చేశారు. 

* ప్రత్యేక అనుబంధం: మా మైలురాయి 20వ సీజన్‌లోకి బ్లూ అండ్ గోల్డ్ జట్టును రోహిత్ నడిపించనుండటం నాకు ఎంతో ఆనందంగా ఉంది. ముంబై ఇండియన్స్, మా పల్టాన్‌తో రోహిత్‌కు ఉన్న అనుబంధం నిజంగా ప్రత్యేకం. రాబోయే సీజన్ గురించి జరిగిన చర్చల్లో మేము కలిసి ఏం సాధించగలమనే దానిపై ఒకే రకమైన ఉత్సాహం, లక్ష్యం కనిపించాయని ఆకాశ్ అంబానీ అన్నారు.

* మధుర జ్ఞాపకాలు: రోహిత్ శర్మ అనుభవం, నాయకత్వం, మేము నిర్మిస్తున్న అద్భుతమైన జట్టుతో రాబోయే సీజన్ ఎంతో ఆసక్తికరంగా ఉండబోతోంది. మా పల్టాన్ గర్వపడేలా క్రికెట్ ఆడుతూ, కలిసి మరెన్నో ప్రత్యేక జ్ఞాపకాలను సృష్టించాలనుకుంటున్నామని పేర్కొన్నారు.