భయ్యా.. ఈ పాట మామూలుగా లేదుగా.. ఇడుపు కాయితం సాంగ్‌కు అదిరిపోయే రెస్పాన్స్!

భయ్యా.. ఈ పాట మామూలుగా లేదుగా.. ఇడుపు కాయితం సాంగ్‌కు అదిరిపోయే రెస్పాన్స్!

Idupu Kayitham : తెలుగు సినీ ఇండస్ట్రీలో వైవిధ్యమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న యాక్టర్ ప్రియదర్శి. బలగం సినిమాతో హీరోగా సూపర్ హిట్ అందుకున్న అతడు, ఆ తర్వాత సేవ్ ది టైగర్స్ సిరీస్‌తో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇప్పుడు ప్రియదర్శి, ఫోక్ డ్యాన్సర్ నాగ దుర్గ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘ఇడుపు కాయితం’. మొదటి నుంచి ఈ మూవీపై మంచి ఆసక్తి నెలకొనగా, ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్, పాటలు ప్రేక్షకులను తెగ ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ చిత్రం నుంచి ‘ఉల్లిపూల’ అంటూ కొనసాగే లిరికల్ వీడియోను మేకర్స్ ఇవాళ (శనివారం, నవంబర్ 28,2026) రిలీజ్ చేశారు. 

ఉల్లిపూల సీరే గట్టి ఉత్తరాది సెరువే దాటి: 

గ్రామీణ వాతావరణం, సహజమైన సన్నివేశాలు, ఆకట్టుకునే ట్యూన్‌తో ఈ సాంగ్ మ్యూజిక్ లవర్స్ ను బాగా ఆకట్టుకుంటోంది. "ఉల్లిపూల సీరే గట్టి ఉత్తరాది సెరువే దాటి.. బండి మీద నీతో పోంగరా నా శ్రీనివాసా.. ఉండలేను ఉన్న తీరుగా" అంటూ సాగే ఈ పాటలో జానపద శైలి, ఆధునిక సంగీతపు హంగులు చక్కగా జోడించారు. మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్బిలి అందించిన బాణీలు ఈ పాటకు ప్రాణం పోయగా, అభినయ శ్రీనివాస్ రాసిన సాహిత్యం సహజంగా, సరదాగా కొనసాగుతూ శ్రోతలను బాగా అలరిస్తోంది. గాయని హెనాగ్రేస్ తన గొంతుతో పాటలోని ఉత్సాహాన్ని, భావోద్వేగాన్ని చక్కగా పలికించాయి.  

దర్శి, దుర్గ కెమిస్ట్రీ హైలైట్: 

ఈ లిరికల్ వీడియోలో ప్రియదర్శి, నాగ దుర్గ మధ్య కనిపించే కెమిస్ట్రీ, గ్రామీణ నేపథ్యంలోని రంగురంగుల దృశ్యాలు, డ్యాన్స్ సన్నివేశాలు పాటను మరింత ఆకర్షణీయంగా మార్చేశాయి. రఘు వి మాస్టర్ కొరియోగ్రఫీ, ఎంఎన్ బాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ, ఆశిష్ తేజ ఆర్ట్ డైరెక్షన్ పాట విజువల్‌గా కూడా ప్రత్యేకంగా నిలిచేలా తీర్చిదిద్దాయి.

వంశీ రెడ్డి దొండపాటి రచన, దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఇడుపు కాయితం’ మూవీని బన్నీ వాస్, తబిత సుకుమార్ నిర్మిస్తున్నారు. శ్రీధర్ సోంపల్లి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తుండగా, పల్లెటూరి సొగసు, ప్రేమ, అనుబంధాల మేళవింపుతో వస్తున్న ఈ చిత్రాన్ని డిసెంబర్ 11వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నట్లు సినీ యూనిట్ ప్రకటించింది.