రెండో వారంలోనూ నిలకడగా ఆకాశంలో ఒక తార కలెక్షన్స్ : ఆ వర్గాల్లో ఆసక్తికర చర్చ

రెండో వారంలోనూ నిలకడగా ఆకాశంలో ఒక తార కలెక్షన్స్ : ఆ వర్గాల్లో ఆసక్తికర చర్చ

Aakasamlo Oka Tara: దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ఆకాశంలో ఒక తార. రిలీజ్ అయ్యి 9 రోజులు అవుతుంది. రెండో వారంలోనూ నిలకడగా కలెక్షన్స్ ఉండటం విశేషం. పేపర్, టీవీ పబ్లిసిటీ అంతగా లేకపోయినా.. ఈ మూవీకి మౌత్ టాక్ బాగా వర్కవుట్ అవుతుంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఆకాశంలో ఒక తారకు మంచి టాక్ నడుస్తుంది. సమాజంపై అవగాహన ఉన్నోళ్లు.. సామాజిక కోణంలో సమాజాన్ని చూసే వ్యక్తులు.. ఆకాశంలో ఒక తార.. అద్భుతమైన సినిమాగా చెప్పటం విశేషం. రెగ్యులర్ రివ్యూ రాతలు ఎలా ఉన్నా.. మిడిల్ క్లాస్ ఫ్యామిలీల్లో.. ఓ సెక్షన్ యూత్ లో ఈ మూవీ డిస్కషన్ ఆసక్తికరంగా ఉండటం విశేషం.

సహజంగానే తెలుగు ఆడియన్స్ పెద్ద హీరోలు.. ఫైట్లు, డాన్సులు, స్పెషల్ సాంగ్స్.. నరుకుడుకు అలవాటు పడిపోయారు అనటంలో సందేహం లేదు. ఇలాంటి టైంలో వచ్చిన ఆకాశంలో ఒక తార మూవీకి మొదటి నాలుగు రోజులు మామూలు సినిమాగానే చూసిన ఆడియన్స్.. ఆ తర్వాత నుంచి మౌత్ టాక్ ద్వారా మంచి టాక్ తెచ్చుకోవటం విశేషం. ఈ క్రమంలోనే ఈ సినిమా కలెక్షన్స్ నిలకడగా ఉన్నాయి. మూవీ రిలీజ్ అయ్యి తొమ్మిది రోజులు అవుతుంది.. సెకండ్ వీకెండ్ వచ్చింది.. సినిమా ఆడుతున్న అన్ని ధియేటర్లలోనూ సగం టికెట్లు బుక్ కావటం ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

ALSO READ : మాజీ ఎంపీ, ప్రముఖ నటి 37 ఏళ్ల వయస్సులో పెళ్లి

ఇప్పటి వరకు ఈ మూవీ 50 కోట్ల రూపాయల కలెక్షన్స్ చేసింది. 75 కోట్ల రూపాయలు దాటొచ్చని అంచనా. గతంలో దుల్కర్ సల్మాన్ నటించిన మహానటి, సీతా రామం, లక్కీ భాస్కర్ సినిమాల తరహాలో తెలుగులో ఆకాశంలో ఒక తార మూవీ మంచి హిట్ టాక్ తెచ్చుకుంటుంది. పవన్ సాదినేని దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సాత్విక వీరవల్లి హీరోయిన్ గా నటించారు. ఆమెకు ఇది ఫస్ట్ మూవీ. శ్రుతి హాసన్ కీలక పాత్రలో కనిపించారు.

• 'ఆకాశంలో ఒక తార' సినిమా 9వ రోజు రూ.50 కోట్ల మార్కును దాటింది. 
• ప్రేక్షకుల నుంచి వస్తున్న మద్దతుతో రెండో వారంలో స్క్రీన్ల సంఖ్య పెరిగింది. 
• దుల్కర్ సల్మాన్ నటించిన 'మహానటి', 'సీతా రామం', 'లక్కీ భాస్కర్' కూడా రూ.50 కోట్లు దాటాయి. 
• ఈ చిత్రం రూ.75 కోట్ల గ్రాస్ వసూలు చేస్తుందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 
• పవన్ సాదినేని దర్శకత్వంలో ఈ సినిమాను లైట్ బాక్స్ మీడియా నిర్మించింది.