హైదరాబాద్ : మాదాపూర్ రహేజా మైండ్‌స్పేస్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. బిల్డింగ్ నంబర్ 1 టెర్రస్‌పై ఉన్న కూలింగ్ టవర్లలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో మైండ్ స్పేస్ లోని కంపెనీల్లో ఉద్యోగులు భయాందోళనకు గురయ్యారు. భయంతో పరుగులు పెట్టారు.
శనివారం ( నవంబర్ 28) మధ్యాహ్నం జరిగిన ఈ ప్రమాదంలో ఎగిసిన పడిన మంటల్లో ఓ కూలింగ్ టవర్ పూర్తిగా కాలిపోయింది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకునొ మంటలను అదుపులోకి తెచ్చారు. పక్క టవర్లకు అంటుకోకుండా సకాలంలో స్పందించి పెద్ద ప్రమాదాన్ని తప్పించారు.
ఈ ప్రమాదంలో ఎవరికి ఎంటుంటి గాయాలు కాలేదని పోలీసులు తెలిపారు. టెర్రస్ పై వెల్డింగ్ పనులు జరుగుతుండగా నిప్పు రవ్వలు పడి ఈ ప్రమాదానికి కారణమైనట్లు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు పోలీసులు.
