Vastu tips: నార్త్ మెయిన్ డోర్ ఇల్లు.. పూజగది.. డైనింగ్హాల్ప్లేస్ ఇదే..!

Vastu tips: నార్త్ మెయిన్ డోర్ ఇల్లు.. పూజగది.. డైనింగ్హాల్ప్లేస్ ఇదే..!

ఇంట్లో ప్రతిది వాస్తు ప్రకారమే ఉండాలి.. అంతేకాదు ఇంటి నిర్మాణం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. ఉత్తరం మెయిన్​ డోర్​ ఉన్న ఇంటికి పూజ గది..   డైనింగ్​ హాల్​ ఏ దిక్కులో ఉండాలి. పూజా గది  అలానే దక్షిణం వైపు ఖాళీ స్థలాన్ని కొంటే ఇబ్బందులు వస్తాయా.....మొదలగు విషయాల గురించి వాస్తు కన్సల్టెంట్​  కాశీనాథుని శ్రీనివాస్​ గారు ఏమంటున్నారో చూద్దాం...


ప్రశ్న: ఉత్తరం వైపు ప్రధాన ద్వారం ఉన్న ఇంటికి పూజ గది, డైనింగ్ హాల్ ఎటువైపు కట్టుకుంటే మంచిది?

జవాబు: ఉత్తరం దిక్కు మెయిన్ డోర్ ఉన్నప్పుడు తూర్పు సెంటర్లో పూజ గది ఉండాలి. ఇలా పూజ గది ఏర్పాటు చేసుకున్నప్పుడు దేవుడు పడమరవైపు చూస్తున్నట్టుగా ఉండాలి. మీరు తూర్పు వైపు చూస్తూ దేవుడ్ని పూజించాలి. అలాగే ఈశాన్యంలో పూజ గది (బరువు) ఉండకపోవడమే మంచిది. కట్టుకునేటప్పుడే కొంచెం పక్కకు మార్చుకుని, తూర్పు సెంటర్లో ఉండేలా కట్టుకుంటే బాగుంటుంది. ఉత్తర సెంటర్లో డైనింగ్ హాల్ కట్టుకోవచ్చని వాస్తు కన్సల్టెంట్​  కాశీనాథుని శ్రీనివాస్​ గారు సూచిస్తున్నారు.

ప్రశ్న: ఇంటి దక్షిణ ప్రహరీకి ఆనుకుని, వెనుకవైపు ఖాళీ స్థలం అమ్మకానికి ఉంది. ఆ స్థలాన్ని కొనుక్కోవచ్చా?

జవాబు: ఇంటికి దక్షిణం వైపు స్థలం తీసుకోకపోవడమే మంచిది. ఇలాంటి స్థలంతో ఇబ్బందులు రావచ్చు. అలాగే పడమర దిక్కు స్థలం కూడా కొనుక్కోకూడదు. ఇంటికి తూర్పు లేదా ఉత్తరం దిక్కుల్లో ఖాళీ స్థలం ఉంటే కొనుక్కోవచ్చని వాస్తు పండితులు  కాశీనాథుని శ్రీనివాస్​ గారు చెబుతున్నారు