తిరుమల కొండకు భక్తులు పోటెత్తారు. శిలాతోరణం వరకు శ్రీవారి భక్తులు క్యూలైన్లలో వేచి ఉన్నారు. స్వామి దర్శనానికి 20 గంటల సమయం పడుతుంది.
తిరుమలలో శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ పెరిగింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్ మెంట్లు నిండి బయట శిలాతోరణం వరకు భక్తులు క్యూలైన్‌లో వేచి ఉన్నారు. ఉచిత సర్వదర్శనానికి సుమారు 20 గంటల సమయం పడుతోందని టీటీడీ వెల్లడించింది. ఎస్‌ఎస్‌డీ టోకెన్ భక్తులకు సుమారు 6 గంటలు, 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం భక్తులకు 4 గంటలు పడుతోంది..
శుక్రవారం ( నవంబర్ 27) శ్రీవారిని 63 వేల 645 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 28 వేల 29 మంది తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి హుండీకి 3 కోట్ల 98 లక్షల రూపాయల ఆదాయం లభించింది. నిన్న ( నవంబర్ 27) 3 లక్షల 76 వేల లడ్డూలు విక్రయించగా, అన్నప్రసాద వితరణ సంఖ్య 2 లక్షల 31 వేలుగా టిటిడి వెల్లడించింది...
