డీలిమిటేషన్ బిల్లును కాక్రోచ్ జనతా పార్టీ చీఫ్ తీవ్రంగా వ్యతిరేకించారు. పార్లమెంటులో నియోజకవర్గాల పునర్విభజన బిల్లును వ్యతిరేకించాలని శనివారం(నవంబర్ 28) అన్ని రాజకీయ పార్టీలకు, పార్లమెంటు సభ్యులకు సీజేపీ చీఫ్ అభిజిత్ దీప్కే విజ్ఞప్తి చేశారు. ఈ బిల్లు ఆమోదానికి ఏ పార్టీ గానీ, రాజకీయ నేతగానీ సహకరించినా అది ప్రజల తీర్పుకు ఘోరరమైన ద్రోహం చేసినట్లేనని అన్నారు.
ఈ బిల్లు అధికార పార్టీకి ప్రయోజనం చేకూర్చే విధంగా ఉందని అభిజిత్ దీప్కే అన్నారు. అధికారి పార్టీకి లబ్ది పొందేందుకే పార్లమెంటరీ, విధాన సభ నియోజకవర్గాలను విభజిస్తున్నారు.. ఇది గెర్రీ మాండరింగ్ అని అన్నారు. దేశంలో ఎన్నికల విధానాన్ని తారుమారు చేస్తున్న జరుగుతున్న కుట్రకు వ్యతిరేకంగా అన్ని పార్టీలు ఐక్యం కావాలని అన్నారు.
🚨 Important Statement 🚨 We appeal to all political parties and Members of Parliament to rise above political differences and take a stand for the nation by opposing the Delimitation Bill! https://t.co/phzZ3nd1Lz
— Cockroach Janta Party - CJP (@Cockroachisback) November 28, 2026
