ఎనిమిది మంది ఐఏఎస్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు

ఎనిమిది మంది ఐఏఎస్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు

హైదరాబాద్: తెలంగాణలో ఐఏఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శిగా సర్ఫరాజ్ అహ్మద్ను ప్రభుత్వం నియమించింది. 3 మున్సిపల్ కార్పొరేషన్లకు సర్ఫరాజ్ ప్రత్యేక అధికారి కావడం గమనార్హం. హెచ్ఎండీఏ కమిషనర్గా ఈవీ నరసింహా రెడ్డికి బాధ్యతలు అప్పగించిన రేవంత్ సర్కార్.. మూసీ కార్పొరేషన్ ఎండీగా అదనపు బాధ్యతలు అప్పగించింది.

మెట్రో రైల్ ఎండీగా అజిత్ రెడ్డికి అదనపు బాధ్యతలు అప్పగించింది. శంషాబాద్ జోనల్ కమిషనర్గా మయాంక్కు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హెచ్ఎండీఏ జాయింట్ కమిషనర్గా చంద్రకళ, హైదరాబాద్ మెట్రో రైల్ జాయింట్ ఎండీగా మనోజ్, విద్యా శాఖ ప్రాజెక్టుల ప్రత్యేక అధికారిగా రామును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వి. శ్రీనివాస్ రెడ్డిని కూడా ప్రభుత్వం బదిలీ చేసింది. విద్యాశాఖ స్పెషల్ ఆఫీసర్ బాధ్యతల నుంచి రిలీవ్ చేసి సొంత డిపార్ట్మెంట్కు రిపోర్ట్ చేయాలని ఆదేశించింది.