ఇజ్రాయెల్ లో కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వాన్ని ఏర్పాటుకు ప్రతిపక్ష నేత గాడి ఐసెన్ కోట్ ను అధ్యక్షుడు ఐజాక్ హెర్జాగ్ ఇప్పటికే ఆహ్వానించగా గడువులోగా ఇజ్రాయెల్ లో తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు సంకీర్ణం దిశగా బెంజిమన్ నెతన్యాహు , ఐసెన్ కోట్ తో జరుపుతున్న చర్చలు జరుపుతున్నారు. రొటేషన్ పద్దతిలో ఏర్పడే ప్రభుత్వంలో ఐసెన్ కోట్ కు అగ్రస్థానం విషయంలో నెతన్యాహు నుంచి స్పష్టమైన ప్రకటన రాకపోవడం, ఐసెన్ కోట్ అనేక సందేహాలు వ్యక్తం చేయడంతో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుపై నెతన్యాహు తీసుకోబోయే నిర్ణయం సర్వత్రా ఉత్కంఠరేపుతోంది.
అక్టోబర్ 27, 2026 లో ఇజ్రాయెల్ పార్లమెంట్ లోని 120 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఎన్నికల ఫలితాల్లో నెతన్యాహు కూటమి 53 సీట్లు గెలుచుకోగా.. ఐసెన్‌కోట్ కూటమి 48 సీట్లు గెలుచుకుంది. అరబ్ పార్టీలు 19 సీట్లు గెలుచుకున్నాయి. అయితే అటు అధికార పార్టీకి, ఇటు ప్రతిపక్ష పార్టీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు మెజార్టీ రాలేదు. దీంతో 19 సీట్లు సాధించిన అరబ్ పార్టీలకు ప్రధాన్యత పెరిగింది. కొత్త ప్రభుత్వాన్ని ఏ ర్పాటు చేయాలని ప్రతిపక్ష నేతల ఐసెన్ కోట్ ను అధ్యక్షుడు ఐజాక్ హెర్జాగ్ ఆహ్వానించారు. ప్రభుత్వం ఏర్పాటు కు ఐసన్ కోట్ కు ఇచ్చిన 28 రోజుల గడువు ఇచ్చారు.
ఒకానొక దశలో అరబ్ పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రతిపక్ష నేత ఐసెన్ కోర్ట్ సిద్దమయ్యారు. ఐసెన్‌కోట్, యైర్ గోలన్ వామపక్ష డెమోక్రటిక్ పార్టీతో సంకీర్ణ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. అయితే అరబ్ పార్టీలకు ప్రభుత్వంలో స్థానం దక్కితే దేశానికి నష్టం అంటూ తాత్కాలిక ప్రధాని బెంజిమన్ నెత్యాన్యాహు, ప్రతిపక్ష నేత ఐసన్ కోట్ తో ప్రభుత్వాన్ని షేర్ చేసుకునేందుకు సిద్దమయ్యారు.ఆదిశగా జరుగుతున్న చర్చల్లో ఇంకా ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. శనివారానికి(నవంబర్ 28) కూడా కొలిక్కి రాలేదు.
రిపోర్టుల ప్రకారం, రొటేషన్ పద్ధతిలో ఏర్పడే ప్రభుత్వంలో ఐసెన్‌కోట్‌కు అగ్రస్థానం కల్పించే ప్రతిపాదనను నెతన్యాహు సిద్ధం చేస్తున్నారని తెలుస్తోంది. అయితే ఐసెన్‌కోట్ దీనిపై సందేహం వ్యక్తం చేస్తూ, నెతన్యాహు పార్టీ చర్చలను ఆలస్యం చేస్తోందని ఆరోపించారు. మరోవైపు ఐసెన్‌కోట్‌కు మొదట ఇచ్చిన 28 రోజుల గడువు డిసెంబర్ 6, 2026 వరకు కొనసాగుతుంది. అవసరమైతే అధ్యక్షుడు మరో 14 రోజులు పొడిగించే అవకాశం ఉంది.
