స్కూల్ సమీపంలో భారీ పేలుడు.. ఏడుగురు స్టూడెంట్స్ మృతి..90మందికి గాయాలు

స్కూల్ సమీపంలో భారీ పేలుడు.. ఏడుగురు స్టూడెంట్స్ మృతి..90మందికి గాయాలు

ఆఫ్ఘనిస్తాన్ లో ఘోరం ప్రమాదం జరిగింది. ఓ స్కూల్ సమీపంలో బాంబు పేలడంతో ఆరుగురు విద్యార్థులు చనిపోయారు. మరో 90 మంది తీవ్రంగా  గాయపడ్డారు.స్కూల్ పక్కనే ఉన్న ఇంట్లో  పేలుడు  సంభవించింది. ఈ పేలుడు ధాటికి డిపోతోపాటు పక్కనే ఉన్న స్కూల్ భవనం కూడా నేలమట్టమయింది.  ఈ ఘటన  ఆఫ్ఘనిస్తాన్ లోని కునార్ ప్రావిన్స్ లో శనివారం ( నవంబర్ 28) జరిగింది. వివరాల్లోకి వెళితే..

తూర్పు ఆఫ్ఘనిస్తాన్‌లోని కునార్ ప్రావిన్స్‌లో శనివారం (నవంబర్ 28) ఉదయం ఈ ఘటన జరిగింది. ఈ పేలుడులో ఏడుగురు విద్యార్థులు చనిపోగా 90 మందికి పైగా గాయపడ్డారు. గాయపడిన వారిలో విద్యార్థులు ఉన్నారు. కునార్ ప్రావిన్స్‌లోని అసదాబాద్ సమీపంలోని అందర్ సెర్ ప్రాంతంలో ప్రైమరీ స్కూల్ లో ఉదయం 10 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్కూల్ పక్కనే ఇంట్లో మైనింగ్ పనుల కోసం ఉపయోగించే డైనమైట్ సహా పేలుడు పదార్థాలను నిల్వ ఉంచడం వల్లే పేలుడు సంభవించినట్లు అధికారులు గుర్తించారు.