November 28 in Cricket Special: క్రికెట్ చరిత్రలో నవంబర్ 28వ తేదీకి ఎన్నో ఆసక్తికర విశేషాలు ఉన్నాయి. దిగ్గజ ఆల్‌రౌండర్ కీత్ మిల్లర్ పుట్టినరోజు, మైఖేల్ హోల్డింగ్ – చందు బోర్డే లాంటి తారల అరంగేట్రాలు, వన్డే ఫీల్డింగ్ నిబంధనలు మార్చిన సిడ్నీ మ్యాచ్, 17 బంతుల్లోనే ఇంగ్లాండ్ తడబాటు, ఆఖరి ఓవర్‌లో 43 పరుగుల రికార్డు.. ఇలా ప్రతి దశాబ్దంలోనూ ఈ రోజు ఏదో ఒక ప్రత్యేకతను దాచుకుంది. 1841 నుంచి 2022 వరకు నవంబర్ 28వ తేదీన క్రికెట్ మైదానంలో జరిగిన ముఖ్య విశేషాలని ఇప్పుడు V6 వెలుగు వెబ్ సైట్లో చూడండి..
1841 – 1876: తొలినాళ్ల క్రికెటర్ల జననం:
* 1841: ఇంగ్లండ్ క్రికెటర్ ఎడ్వర్డ్ గ్రేస్ జన్మించారు. ఈయన కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్.. ఒక టెస్ట్ మ్యాచ్ ఆడి 36 పరుగులు చేయగా, ఇక 314 ఫస్ట్-క్లాస్ మ్యాచులు ఆడిన గ్రేస్.. 10,025 పరుగులు చేశాడు.
* 1866: ఇంగ్లాండ్ వికెట్ కీపర్ డిక్ లిల్లీ పుట్టారు. తన కెరీర్‌లో 714 క్యాచ్‌లు, 197 స్టంపింగ్స్ చేశారు. 1896లో జేమ్స్ కెల్లీ క్యాచ్ జారవిడవడం, 1902లో ఎనిమిది పరుగుల దూరంలో క్లెమ్ హిల్ చేతికి చిక్కడం వంటి నాటకీయ ఓటములతో ఆయన పేరు నిలిచింది.
* 1876: సౌతాఫ్రికా స్పిన్నర్ బెర్ట్ వోగ్లర్ జన్మించారు. 1907లో అత్యుత్తమ బౌలర్లలో ఒకరిగా నిలిచారు. 15 టెస్టుల్లో 64 వికెట్లు తీయగా, 1910లో ఇంగ్లండ్‌పై 7/94 ఆయన అత్యుత్తమ బౌలింగ్.
* 1919: ఆసీస్ దిగ్గజ ఆల్‌రౌండర్ కీత్ మిల్లర్ జననం:
ఆస్ట్రేలియా క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ ఆల్‌రౌండర్లలో ఒకరైన కీత్ మిల్లర్ 1919లో జన్మించారు. 3, 5 స్థానాల్లో బ్యాటింగ్‌తో పాటు కొత్త బంతితో ప్రమాదకర బౌలర్‌గా పేరుపొందారు. 55 టెస్టులు ఆడిన ఆయన, 1946–47 బ్రిస్బేన్ టెస్టులో ఇంగ్లండ్‌పై 7/60 తీశారు. 1954–55 కరేబియన్ పర్యటనలో ఆరు ఇన్నింగ్స్‌ల్లో మూడు సెంచరీలు, 20 వికెట్లతో ఆసీస్ 3-0 విజయంలో కీలక పాత్ర పోషించారు. 2004 అక్టోబర్‌లో కన్నుమూశారు.
1958 – 1975: అరంగేట్రాల సందడి:
* 1958: బాంబేలో భారత్–వెస్టిండీస్ డ్రా టెస్టులో చందు బోర్డే, వెస్ హాల్, బాసిల్ బుచర్ అరంగేట్రం చేశారు. తొలి ఇన్నింగ్స్‌లో టాప్-3 సహా నాలుగు వికెట్లు తీసిన హాల్, 64* చేసిన బుచర్ మెరవగా, బోర్డే వికెట్ లేకుండా 7 పరుగులకే రనౌట్ అయ్యారు.
* 1969: ఇంగ్లండ్ వన్డే ఓపెనర్ నిక్ నైట్ జన్మించారు. వన్డేల్లో వేగవంతమైన ఆరంభాలు ఇచ్చిన ఆయన 2003లో రిటైరయ్యారు.
1970: యూఏఈ క్రికెటర్ అర్షద్ లయీక్ జన్మించారు.
* 1975: బ్రిస్బేన్‌లో ఆసీస్‌తో తొలి టెస్టులో వెస్టిండీస్ పేసర్ మైఖేల్ హోల్డింగ్ డెబ్యూ చేశారు. ఆయనకు వికెట్ దక్కకపోయినా (0/127), గ్రెగ్ చాపెల్ రెండు ఇన్నింగ్స్‌ల్లో సెంచరీలు (123, 109*) చేసి ఆసీస్‌ను ఎనిమిది వికెట్ల తేడాతో గెలిపించారు.
1979 – 1999: రూల్స్ మార్చిన మ్యాచ్.. ఇంగ్లండ్ తడబాటు:
* 1979: సిడ్నీ వన్డేలో చివరి బంతికి విండీస్‌కు 3 పరుగులు కావాల్సి ఉండగా, ఇంగ్లండ్ కెప్టెన్ మైక్ బ్రియర్లీ కీపర్‌తో సహా అందరినీ బౌండరీ లైన్ దగ్గర నిలబెట్టారు. ఇంగ్లండ్ 2 పరుగులతో గెలిచినా, ఆ తర్వాత వన్డేల్లో ఫీల్డింగ్ ఆంక్షలు వచ్చాయి.
* 1987: ఇంగ్లండ్ వికెట్ కీపర్-బ్యాటర్ క్రెయిగ్ కీస్వెటర్ జన్మించారు. 2010 టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌లో హాఫ్ సెంచరీ చేసిన ఆయన, 2014 గాయం తర్వాత 2015లో రిటైర్ అయ్యారు.
1989: న్యూజిలాండ్ క్రికెటర్ ఫ్రాన్సెస్ కింగ్ జన్మించారు.
* 1999: జోహన్నెస్‌బర్గ్ టెస్టులో డొనాల్డ్, పొలాక్ ధాటికి ఇంగ్లండ్ 17 బంతుల్లోనే 2/4 వద్ద కుప్పకూలి, ఇన్నింగ్స్ తేడాతో ఓడింది.
2009 – 2022: యువకుల సెంచరీలు.. మైలురాళ్లు:
* 2009: గబ్బా టెస్టులో 19 ఏళ్ల విండీస్ బ్యాటర్ అడ్రియన్ బరాత్ అరంగేట్ర సెంచరీ (132 బంతుల్లో) చేసినా జట్టు ఇన్నింగ్స్ తేడాతో ఓడింది. డునెడిన్‌లో అరంగేట్రం చేసిన పాక్ యువ బ్యాటర్ ఉమర్ అక్మల్ (129, 75) పోరాడినా, షేన్ బాండ్ దెబ్బతో కివీస్ గెలిచింది.
* 2020: WBBL ఫైనల్‌లో ఇస్మాయిల్, సామీ జో-జాన్సన్ బౌలింగ్‌తో మెల్‌బోర్న్ స్టార్స్ 86 పరుగులకే ఆలౌట్ కాగా, సిడ్నీ థండర్ రెండో టైటిల్ గెలుచుకుంది. 14వ ఓవర్‌లో హీథర్ నైట్ సిక్సర్‌తో లక్ష్యం చేరుకుంది.
* 2022: విజయ్ హజారే ట్రోఫీ క్వార్టర్ ఫైనల్‌లో ఉత్తరప్రదేశ్‌పై మహారాష్ట్ర బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ ఒకే ఓవర్‌లో ఏడు సిక్సర్లతో (శివ సింగ్ బౌలింగ్‌లో 43 పరుగులు) లిస్ట్-ఏ క్రికెట్ ప్రపంచ రికార్డు సృష్టించారు. ఆ మ్యాచ్‌లో 159 బంతుల్లో 220 నాటౌట్ సాధించారు.
