డీలిమిటేషన్‌‌‌‌పై  బీజేపీకి బీఆర్ఎస్ మద్దతా?  ముందు వ్యతిరేకించి ఇప్పుడు  ఎలా సపోర్ట్ చేస్తారు: పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్

డీలిమిటేషన్‌‌‌‌పై  బీజేపీకి బీఆర్ఎస్ మద్దతా?  ముందు వ్యతిరేకించి ఇప్పుడు  ఎలా సపోర్ట్ చేస్తారు: పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్

 
హైదరాబాద్, వెలుగు: డీలిమిటేషన్‌‌‌‌తో దక్షిణాది రాష్ట్రాలకు తీరని అన్యాయం జరుగుతుందని పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ ఆరోపించారు. దీనిపై బీజేపీకి బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ మద్దతు ఇవ్వడం ఆశ్చర్యకరంగా ఉందన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. తమిళనాడు సీఎం స్టాలిన్‌‌‌‌తో జరిగిన సమావేశం సందర్భంలో ఈ బిల్లును వ్యతిరేకించిన బీఆర్ఎస్.. ఇప్పుడు ఎలా మద్దతు ఇస్తుందని ప్రశ్నించారు. 


బీఆర్ఎస్ ఆలోచన ఏంటో అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. అంతకు ముందు మహేశ్ గౌడ్ నెక్లెస్ రోడ్డులోని జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా పూలే దంపతుల విగ్రహాలకు పూలమాలవేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో పూలే ఆశయాలకు అనుగుణంగా ప్రజా పాలన సాగుతుందన్నారు.  సమాజానికి పూలే దంపతుల సేవలు స్ఫూర్తిదాయకం అని, వారి ఆలోచనలను నిరంతరం కొనసాగించే ప్రయత్నం చేస్తామన్నారు. నెక్లెస్ రోడ్డులో సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోనే పూలే దంపతుల విగ్రహాలను ఏర్పాటు చేసినట్లు గుర్తు చేశారు.