ఫీజు బకాయిలు విడుదల చేయాలి: ఆర్.కృష్ణయ్య

ఫీజు బకాయిలు విడుదల చేయాలి: ఆర్.కృష్ణయ్య

మెహిదీపట్నం, వెలుగు:పెండింగ్‌‌‌‌లో ఉన్న రూ.8 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌‌‌‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయకపోతే రాష్ట్రాన్ని స్తంభింపజేస్తామని రాజ్యసభ సభ్యుడు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ప్రభుత్వాన్ని హెచ్చరించారు. శనివారం మెహిదీపట్నం వద్ద వేలాది మంది విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించడంతో ట్రాఫిక్ స్తంభించింది.కృష్ణయ్య మాట్లాడుతూ.. ఫీజుల గందరగోళంతో ఉన్నత విద్యపై విద్యార్థులకు నమ్మకం పోయిందన్నారు. 

డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్‌‌‌‌లో లక్షలాది సీట్లు మిగిలిపోయాయని, 600 కాలేజీలు మూతపడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. కోర్సు పూర్తయిన 4 లక్షల మంది విద్యార్థుల సర్టిఫికెట్లను కాలేజీలు నిలిపివేయడంతో ఉద్యోగాలు, పైచదువులకు దూరమవుతున్నారన్నారు.