- జనవరి నుంచి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కొత్త నిబంధన
ముంబై: వచ్చేఏడాది జనవరి 1 నుంచి రూ. 500 లేదా అంతకంటే తక్కువ విలువైన యూపీఐ లావాదేవీలకు ఇకపై మొబైల్‌కు ఎస్ఎంఎస్ అలర్ట్‌లు ఉండవని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ప్రకటించింది. అయితే ఎంత చిన్న మొత్తమైనా సరే అన్ని రకాల యూపీఐ లావాదేవీలకు ఈ–-మెయిల్ అలర్ట్‌లు మాత్రం ఉచితంగా కొనసాగుతాయని బ్యాంక్ స్పష్టం చేసింది. దీనికోసం ఖాతాదారులు తమ బ్యాంక్ ఖాతాకు సరైన ఈ–-మెయిల్ ఐడీని లింక్ చేసుకోవాలి.
