- ఉల్లి ధర 116 శాతం జంప్
- అల్లం రేటు 48 శాతం అప్
న్యూఢిల్లీ: దేశంలో నిత్యావసర వస్తువులు, ఆహార పదార్థాల ధరలు పెరగడంతో సామాన్య కుటుంబాల నెలవారీ బడ్జెట్‌పై భారం పడుతోంది. అక్టోబరులో ఆహార ద్రవ్యోల్బణం పెరగడానికి ఉల్లి, వెల్లుల్లి, పాల ఉత్పత్తులు ప్రధాన కారణంగా నిలిచాయి. కేంద్ర ఆర్థిక శాఖ లెక్కల ప్రకారం, అక్టోబరులో ఉల్లి ధరలు 116 శాతం పెరిగాయి. వెల్లుల్లి ధర 61 శాతం, అల్లం ధర 43 శాతం, నిమ్మ ధర 47 శాతం మేర ఎగబాకాయి. ధాన్యాలు, పప్పులు, వంటనూనెల ధరలపైనా పెరుగుదల ఒత్తిడి కనిపించింది.
ఏడాది ప్రాతిపదికన బియ్యం ధరలు 12.5 శాతం, గోధుమ ధరలు 3.1 శాతం పెరిగాయి. కంది పప్పు 15 శాతం, మినుములు 12 శాతం మేర ప్రియమయ్యాయి. రిఫైండ్ నూనె, వేరుశనగ నూనె ధరలు సుమారు 16 శాతం, ఆవ నూనె ధర సుమారు 10 శాతం పెరిగాయి. పాల ఉత్పత్తుల ధరలు సైతం పండుగ డిమాండ్ కారణంగా పెరిగాయి. పాలు 4.6 శాతం, పన్నీరు 5.7 శాతం, పెరుగు 4.4 శాతం, పాలతో చేసే మిఠాయిలు 10 శాతం మేర ఖరీదయ్యాయి. మాంసం, గుడ్ల ధరలూ పెరిగాయి. చికెన్ 11.3 శాతం, ఇతర మాంసం 10.6 శాతం, చేపలు 8.5 శాతం, గుడ్లు 8.3 శాతం పెరిగాయి.
ఆలు, టమాటా ధరలు డౌన్
టమాటా ధర 5.8 శాతం , ఆలు ధర 14 శాతం తగ్గింది. ప్రభుత్వ జోక్యంతో టోకు మార్కెట్లో ఉల్లి ద్రవ్యోల్బణం 11 శాతం పాయింట్లు తగ్గిందని, రానున్న నెలల్లో ఉల్లి ధరల ఒత్తిడి తగ్గుతుందని ఆర్థిక శాఖ భరోసా ఇచ్చింది. అయితే నవంబరులోనూ పండుగలు, పెళ్లిళ్ల సీజన్ కొనసాగుతున్నందున పాల ఉత్పత్తుల ధరలపై ఒత్తిడి కొనసాగవచ్చని తెలిపింది. అక్టోబరులో రిటైల్ ద్రవ్యోల్బణం 6.09 శాతానికి చేరి, ఆర్బీఐ 6 శాతం గరిష్ఠ పరిమితిని తొలిసారి దాటింది. బలమైన ఎల్ నినో ఏర్పడే అవకాశం, అంతర్జాతీయ ఉద్రిక్తతలు, హార్మూజ్ జలసంధి రవాణా సమస్యల వల్ల ముడి చమురు దిగుమతి బిల్లులు, సరుకు రవాణా చార్జీలు
పెరగవచ్చని రిపోర్ట్హెచ్చరించింది.
భారీగా పెరిగినవి...
ఆహార పదార్థం పెరుగుదల (%)
ఉల్లి 116
వెల్లుల్లి 61
నిమ్మ 47
రిఫైండ్ నూనె 16
పల్లి నూనె 16
