కాన్బెర్రా: వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్‌టైన్‌మెంట్ (డబ్ల్యూడబ్ల్యూఈ) స్టార్ రెజ్లర్ జెర్మైన్ హేలీ అలియాస్ బ్రాన్‌సన్ రీడ్ (38) కన్నుమూశారు. అనారోగ్య కారణాలతో ఆయన శనివారం ఉదయం మృతి చెందినట్లు డబ్ల్యూడబ్ల్యూఈ ప్రకటించింది. ఆస్ట్రేలియాకు చెందిన రీడ్ 2007లో రెజ్లింగ్ కెరీర్ ప్రారంభించారు. 2019లో డబ్ల్యూడబ్ల్యూఈలోకి ఎంట్రీ ఇచ్చి 2021లో ‘ఎన్ఎక్స్ టీ నార్త్ అమెరికా ఛాంపియన్‌షిప్’ను గెలుచుకున్నారు.
రీడ్ భార్య ప్రస్తుతం గర్భవతిగా ఉన్నారు. అంతకుముందు వారికి కుమార్తె ఉంది. ఈ నెల 7న సౌదీ అరేబియా వేదికగా జరిగిన ‘క్రౌన్ జెవెల్’ షోలోనూ బ్రాన్‌సన్ పాల్గొన్నాడు. ఆ లైవ్ ఈవెంట్‌లో మరో రెజ్లర్ ఆయనను పైకెత్తి టేబుల్‌పై పడేయడంతో తీవ్రంగా గాయపడ్డట్టు, దీంతో ఆస్పత్రిలో చేరినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. అయితే ఆ ఘటనలో జరిగిన గాయాలవల్లే బ్రాన్‌సన్ రీడ్ చనిపోలేదని డబ్ల్యూడబ్ల్యూఈ వెల్లడించింది.
