న్యూఢిల్లీ, వెలుగు: కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్ బిల్లు తీసుకురానున్న నేపథ్యంలో పలు పార్టీల నేతలు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. శనివారం ఢిల్లీలో వైఎస్సార్సీపీ నేత వైవీ సుబ్బారెడ్డి, డీఎంకే నేతలు కనిమొళి, రాజా, విల్సన్ తదితరులు అమిత్ షాతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అమిత్ షాను నేతలు సన్మానించారు. పార్టీ తరఫున మద్దతు తెలిపినట్లు సమాచారం. డీలిమిటేషన్ బిల్లు నేపథ్యంలో ఈ భేటీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
